పాక్‌పై దాడి చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తాం: బంగ్లాదేశ్ నేత
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్- భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న క్రమంలో పాకిస్థాన్‌పై భారత్ దాడి చేస్తే ఆ దేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటామని సైన్యానికి చెందిన విశ్రాంత మేజర్ జనరల్ ఏఎల్‌ఎం ఫజ్లుర్ రహ్మాన్ రెచ్చగొట్టే వాఖ్యలు చేశారు. అది కూడా చైనా సాయంతో ఏడు ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకోవాలని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
“పాక్‌పై భారత్ దాడి చేస్తే, ఆ దేశంలోని 7 ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకోవాలి. అందుకోసం సంయుక్త సైనిక ఏర్పాట్లపై చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం చాలా ఉంది” అని ఫజ్లుర్ రహ్మాన్ బెంగాలీలో రాశారు. అయితే, ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని బంగ్లాదేశ్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇటువంటి వాటిని ప్రోత్సహించమని స్పష్టం చేసింది. అయితే, వ్యక్తిగత అభిప్రాయాలను ప్రభుత్వంతో ముడిపెట్టవద్దని పేర్కొంది. పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాలను కొనసాగించాలనే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్‌కు రహ్మాన్ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.