పీఓకేపై రాజ్ దీప్ వ్యాఖ్యల దుమారం
భారత జర్నలిజంలో అతిపెద్ద పేర్లలో ఒకరైన రాజ్‌దీప్ సర్దేశాయ్ మళ్ళీ తుఫానుకు కేంద్రబిందువుగా నిలిచారు. ఇటీవల ఇండియా టుడే చర్చ సందర్భంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)పై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను రగిలించాయి. పాకిస్థాన్ తో శాశ్వత వివాదాల పరిష్కారంకోసం భారతదేశం ఆక్రమిత కాశ్మీర్ ను పాకిస్తాన్ కు అప్పగించి, అంతర్జాతీయ సరిహద్దుగా నియంత్రణ రేఖను అధికారికం చేయాలని సూచించడం, పాకిస్తాన్ అణ్వాయుధ ఆయుధ సామగ్రిని తక్కువ అంచనా వేయడం సాహసమే అంటూ హెచ్చరించడం .. చేయాలంటే సాహసమే అవసరం.
“కీలక అంశాలను చేపట్టకుండా శాశ్వత పరిష్కారం సాధ్యం కాదు. ఆ విధంగా చేయాలంటే ఒక వంక ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ మరోవంక జమ్మూ కాశ్మీర్ లోని అంతర్గత అంశాలు చూడాలి. అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. నియంత్రణ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించాలి. నా దృష్టిలో అదే సాధ్యమయ్యే పరిష్కారం. లేక, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి మనం ఏవిధంగా వెడతాము? వెడితే పాకిస్థాన్ చూస్తూ ఊరుకుంటుందా?” అన్న రాజదీప్ వాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
పైగా, అగ్నికి ఆజ్యం పోసిన్నట్లు పాకిస్థాన్ సైనిక సామర్ధ్యం గురించి తక్కువగా అంచనా వేయవద్దని ఆయన హెచ్చరించడం ఆగ్రవేశాలు కలిగిస్తున్నది. నిర్లక్ష్యపూర్వకంగా అటువంటి వాఖ్యలు చేశారా? ఈ వాఖ్యలు ఆయనను ఇండియా టుడే నుండి నిష్క్రమించేటట్లు చేస్తాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన ఉద్యోగాన్ని కోల్పోయారా? అనే సందేహం నేడు దేశాన్ని పట్టిపీడిస్తున్నది. జాతీయ భావోద్వేగం తీవ్రంగా ఉన్న, పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై దేశ ప్రజలు ఆగ్రవేశాలతో ఉన్న సమయంలో, పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతున్నాయి.