పెసర పప్పుతో శరీరానికి అత్యంత చలువ… ఎండా కాలం లో బెస్ట్

వేసవి వచ్చేసింది. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు కొబ్బరి బోండాలు తీసుకుంటే, మరి కొందరు నిమ్మకాయ నీరు, మరి కొందరు కర్బుజా కాయ లాంటివి తీసుకుంటారు. అయితే… పెసరపప్పు కూడా వేసవి కాలంలో ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన వంటింట్లోనే వుండే పెసర పప్పు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఈ ఎండా కాలంలో వేడిని కూడా తగ్గిస్తుంది. ఈ పప్పుతో కూరలు, స్నాక్స్‌, బ్రేక్‌ ఫాస్ట్‌ వంటివి కూడా తయారు చేస్తారు.పెసర పప్పు తినడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్‌, ప్రొటీన్లు మెండుగా వుంటాయి. కొద్దిగా తిన్నా… త్వరగా కడుపు నిండుతుంది. అంతేకాకుండా పోషకాలు కూడా అన్నీ శరీరానికి అందుతాయి. పెసర పప్పు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ కూడా అదుపులో వుంచుతుంది. ఇలా ఈజీగా బరువు తగ్గొచ్చు.

పెసర పప్పులో పోషకాలు అనేవి అధికంగా వుంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. బాడీలో రోగనిరోధక శక్తి పెరగడం వల్ల సీజనల్‌ వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. అందులోనూ వేసవిలో ఎక్కువగా అలసట, నీరసం వస్తాయి. పెసర పప్పు తినడం వల్ల అలసట లేకుండా ఉండొచ్చు. వేసవిలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా వుండటం వల్ల, చర్మాన్ని, జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. అదే విధంగా చర్మంపై ముడుతలు రాకుండా నిరోధిస్తుంది.

అలాగే వేసవి కాలంలో శ్రీరామ నవరాత్రులు వస్తాయి. తొమ్మిది రోజుల పాటు శ్రీ రామచంద్రుడ్ని ఆరాధిస్తారు. అలాగే ఉగాది కూడా వస్తుంది. శ్రీరామ నవమి రోజున ఈశ్వరుడికి పెసర పప్పుతో చేసిన ప్రసాదాలే పెడతారు. ఎండా కాలంలో ఎండ విపరీతంగా వుంటుంది కాబట్టి, శక్తిని, చలువనిచ్చే పెసరపప్పు మంచిది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *