పైన కొబ్బరి పీచు సంచులు.. లోపల ఆవులు… పట్టుకున్న పోలీసులు
వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గోవులను భువనగిరిలో బజరంగ్ దళ్, గోరక్షక్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వాహనంలో పైన కొబ్బరి పీచు మూటలు వేసి, కింద గోవులను వుంచేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్ కి అక్రమంగా గోవులను తరలిస్తున్న ఈ వాహనాన్ని బజరంగ్ దళ్ కార్యకర్తలు భువనగిరిలో గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఈ వాహనాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మరిశెట్టి సతీశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ 16 గోవులను జియాగూడ గోశాలకు పంపించారు. అయితే ఇద్దరు పరారీలో వున్నారని, వారిని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.