ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఆయుర్వేద మూలికలు
మూలికలు-
నిమ్మకాయ, అల్లం, జీలకర్ర, సైన్ధవ లవణం, ఉప్పు, వాము, కురసాని వాము, ఇంగువ, సున్నము, బెల్లము, తేనె, ఆవునెయ్యి, నువ్వులనూనె, కుంకుడు కాయలు, వాము పువ్వు, పుదీనాపువ్వు, పచ్చ కర్పూరం, కర్పూరం, తెల్ల ఆవాలు, ఆవాలు, ఆముదము, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, సీమగొబ్బి విత్తనాలు, మిరియాలు, ధనియాలు, సుగంధపాల, గంధపుచెక్క, కస్తూరి, దుప్పికొమ్ము, అక్కలకర్ర, అతిమధురము, యష్టిమధుకము, కరక్కాయ, పిప్పళ్లు, పెద్ద ఉశిరిక పప్పు, పటిక, శొంటి, పటికబెల్లము, నీరుల్లి, వెల్లుల్లి, దుంపరాష్ట్రము, మోడీ, మోదుగ మాడలు, రుద్రాక్షలు, అరటిపండ్లు, తమలపాకులు, పసుపు, వాము, తేనె మైనం మొదలైనవి .
ఇంటి అవరణలో పెంచదగిన చెట్లు –
నిమ్మ, నారింజ, వేప, వెలగ, ములగ, ఉత్తరేణి, తెల్ల గురువింద, నందివర్దన, మందార, తెల్ల జిల్లేడు, నల్ల ఉమ్మెత్త, అవిశ, అరటి, పనస, తెల్ల ఈశ్వరి, మారేడు, ఉడుగ, దిరిశన, తుమ్మ, గరిక, తుమ్మి, చంద్రకాంత, గన్నేరు, తోటకూర, గోంగూర, బచ్చలి, చిత్రమూలం, సరస్వతి, చిర్రి, మోదుగ, నల్లేరు, కాడజెముడు, దూలగొండి, వెంపలి, పుదినా, వాము, తులసి, కొబ్బరి, జీడిమామిడి, కానుగ, పిప్పిలి, టేకు, వెదురు, జాజి, గులాబి, మల్లె, దానిమ్మ, పెద్ద ఉశిరిక, మేడి మొదలైన ఔషధ చెట్లు గృహ ఆవరణలో లేక గృహానికి చుట్టుపక్కల ప్రదేశాలలో తప్పక పెంచవలెను.
– ఉషాలావణ్య పప్పు