ప్రధాని సూర్య ఘర్ యోజన కోసం మీరూ అప్లయ్ చెయ్యండి .. ఇప్పటి వరకు కోటి మంది అప్లయ్ చేసారు

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన అన్న పతాకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి దేశ వ్యాప్తంగా విశేష స్పందన వస్తోంది. దేశ వ్యాప్తంగా చాల మంది దీనికి ఆకర్షితులై, అప్ప్లయ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కోటి మంది అప్ప్లయ్ చేసుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీనిపై హర్షం వ్యక్తం చేసారు. ముఖ్యంగా అస్సాం, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిస్స, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగాయని మోడీ ప్రకటించారు. ఈ పథకం కింద ఇంకా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ఉచిత విద్యత్ పథకం మరింత  మంది రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని, పర్యావరణానికి మెరుగైన సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. అలాగే గృహాలకు విద్యుత్ ఖర్చును కూడా తగ్గిస్తుందని అన్నారు.

ఎంత సబ్సిడీ ఇస్తారంటే..

ఈ పథకం కింద దరఖాస్తు చేయడానికి ఆరు నెలల విద్యుత్ బిల్లును ఉంచుకోవాలి. కొత్త సోలార్ రూఫ్ టాప్ పథకం కింద వినియోగదారులకు ప్రతీ నెల ౩౦౦ ఉనిట్ల వరకు ఉచిత సౌర విద్యుత్ పొందవాచు. అలాగే మిగులును విద్యుత్ పంపిణి సంస్థలకు విక్రయిస్తూ ఏడాదికి రూ. 18,౦౦౦ వరకు ఆదా చేసుకోవచు.

దీనికి దరఖాస్తు ఎలా అంటే ….

1. ముందుగా https://pmsuryaghar.gov.in పోర్టల్లో మీరు పేరు నమోదు చేసుకోవాలి.
2.మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి.
౩. మీ విద్యుత్ కనెక్షన్ నెంబర్, మొబైల్, ఈ మెయిల్ ని ఎంటర్ చెయ్యాలి.
4. పోర్టల్ లో ఉన్న నియమాలకు అనుగుణంగానే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి.
౫. ఆ తర్వాత కన్సుమేర్ నెంబర్, మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. అక్కడ రూఫ్ టాప్ సోలార్ కోసం అప్ప్లయ్ చేసుకోవాలి.
6. దరఖాస్తు పూర్తి చేసి, డిస్కం నుండి అనుమతులు వచ్చే వరకు వేచి చూడాలి.
7. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కం లోని నమోదిత విక్రేతల నుండి సోలార్ ప్లాంట్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి.
8. ఇన్స్టలేషన్ పూర్తీ అయిన తర్వాత, ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్ లో సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
9. నెట్ మీటర్ ను ఇన్స్టాల్ చేసాక, డిస్కం అధికారులు తనిఖి చేస్తారు. అంతరం పోర్టల్ నుండి కమిశనింగ్ పత్రం ఇస్తారు.
10. ఈ రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటూ క్యాన్సిల్ద్ చెక్ ను పోర్టల్ లో సబ్మిట్ చేయాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.

ఎలక్ట్రిక్ వహాల ఛార్జింగ్ లోనూ…

సూర్య యోజన వల్ల ఇంధన ఉత్పత్తికి హామీ ఇస్తుంది. అలాగే విద్యుత్ ఖర్చు తగ్గుతుంది. దీని నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను విక్రయించడం ద్వార ఏట దాదాపూ 18,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు .

దీని వల్ల ప్రయోజనాలు ఇవీ. …..

1. కరెంటు బిల్లు ఆదా అవుతుంది.
2. అందుబాటులో ఉన్న ఖాళీ ఫైకప్పు స్థలాన్ని ఉపయోగించాలి.
౩. ఉపాధి కూడా లభిస్తుంది.
4. ప్రతి నెల ౩౦౦ యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తారు.
5. సబ్సిడీ మొదలు బ్యాంకు రుణాల వరకు ఎలాంటి భారం పడదు.
6. ప్రజల ఆదాయం పెరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *