ప్రపంచానికి ధర్మాన్ని బోధించడం భారత్ విధి : మోహన్ భాగవత్
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత భారత దేశ నాగరికత అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. భారత దేశం ప్రపంచ శాంతి సామరస్యం కోసం కృషి చేస్తుందని తెలిపారు.జైపూర్ లోని హర్మదాలో రవీంద్ర నాథ్ మహారాజ స్మృత్యర్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు.
త్యాగమయ సంప్రదాయాన్నే భారత్ ఎప్పుడూ విశ్వసిస్తోందని, రాముడి నుంచి భామాషాహ్ వరకూ నడుస్తోందన్నారు. ప్రపంచానికి ధర్మాన్ని బోధించడం భారత్ విధి అని నొక్కి చెప్పారు. కానీ… ఈ ధర్మబోధ చేయాలంటే దానికి బలం కూడా అవసరమేనని అంతే నొక్కి వక్కాణించారు.భారత్ ఎవ్వరి పట్లా ద్వేష భావనతో వుండదని, కానీ.. బలంగా వున్నప్పుడే ప్రేమ, ఆప్యాయత, శ్రేయస్సు అన్న భాషను ప్రపంచం విటుందని, అది ద్వాని స్వభావమని, మార్చలేమన్నారు. అందుకే ప్రపంచ సంక్షేమం కోసం భారత్ బలంగా మారాలని సూచించారు. అయితే ఇప్పటికే భారత్ బలమేమిటో ప్రపంచం చూసిందన్నారు.
భారత్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తోందని, ఇప్పటికే భారత్ బలమేమిటో అందరికీ తెలుసన్నారు. భారత్ చాలా మందికి సహాయం చేస్తోందని, కానీ.. సహాయం పొందిన దేశాలే కొన్ని సార్లు వ్యతిరేకం అవుతాయని, అయినా… సహకారం అన్న స్ఫూర్తితో మనం సహాయం చేస్తూనే వుంటామన్నారు.లోక సంక్షేమం కోసమే హిందూ ధర్మమమని, లోక సంక్షేమం అన్నది హిందూ ధర్మంలో ఓ ముఖ్యమైన విధి అని మోహన్ భాగవత్ తెలిపారు. మనది ఋషి సంప్రదాయమని, దీనిని సాధు సమాజం ముందుకి తీసుకెళ్తోందన్నారు.