ప్రపంచ దృష్టి మన భారత్ వైపే : ఏబీవీపీ బాలకృష్ణ
దేశ పునర్నిర్మాణం లో యువతను భాగస్వామ్యం చేస్తూ ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టే ప్రయత్నంలో ఏబీవీపీ నిమగ్నమై వుందని ఏబీవీపీ జాతీయ సంఘటనా కార్యదర్శి బాలకృష్ణ తెలిపారు. ఆ క్రమంలో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తందని అన్నారు. ఈ దేశ వారతస్వం చాలా గొప్పదని దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా యువత నైపుణ్యాలను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తుందని తెలిపారు. ఈ దేశానికి వ్యతిరేకంగా విదేశీ భావజాలంతో పురుడు పోసుకున్న కొన్ని విద్యార్థి సంఘాలు ఈ దేశంలోని లక్షల మంది విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటే ఈ దేశం కోసం, మట్టి కోసం చివరి శ్వాస వరకు ఏబీవీపీ కార్యకర్తలు పోరాడుతున్నారని అన్నారు. దేశానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి సమాజంలో అందరినీ కలుపుకుంటూ దేశం కోసం పనిచేసే వారు కేవలం ఏబీవీపీ కార్యకర్తలేనని తెల్చి చెప్పారు.
ఈ దేశంలో లడక్ నుండి కడక్ వరకు కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న ప్రాంతాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమనే ఒక అంత సూత్రం పైనే మన జీవన విధానం కొనసాగుతుందని తెలిపారు . ఈ దేశం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు ఈతరానివి కావని, వేల లక్షల సంవత్సరాల క్రితం నాటివని అన్నారు. అంతటి పురాతనమైన వాటిని నాశనం చేయాలని చూసిన వారందరూ కాలగర్భంలో కలిసిపోయారన్నారు. 3 లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం కోసం ఎంతో మంది మహనీయులు భారత్ మాతా కోసం ,జాతీయ జెండా కోసం నవ్వుతూ ప్రాణాలను అర్పించిన చరిత్ర ఈ దేశానికి ఉందన్నారు.

1949 లో సంవత్సరం నుండి నేటి వరకు దాదాపు 77 సంవత్సరాలుగా వందేమాతరం గీతాన్ని ప్రజల్లో విస్తరించి దేశం పట్ల గౌరవాన్ని చైతన్యాన్ని కలిగించిన విద్యార్థి సంస్థ ఏబీవీపీ మాత్రమే అని తెలిపారు. స్వామి వివేకానంద, అరవింద్ ఘోష్, సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్ లాంటి మహనీయులు దేశంలోని యువత పైన ఒక పాజిటివ్ మూమెంట్ తీసుకోచ్చారని ఆ స్ఫూర్తితోనే యువతను సన్మార్గంలో నడిపిస్తూ దేశ సౌభాగ్యమే ముందు తర్వాతనే విద్యా, కుటుంబమనే భావాజాలాన్ని వ్యాప్తి చేస్తుందన్నారు.
ఆ క్రమంలో అవసరమైతే దేహము, ప్రాణము ఈ దేశం కోసం అర్పించడానికి యువత సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సంఘటన కార్యదర్శి జరిగే శివకుమార్ ఎబివిపి తెలంగాణ ప్రాంత ప్రముఖ్ డాక్టర్ మాసాడి బాబురావు, ప్రాంత సంఘటన కార్యదర్శి విష్ణువర్ధన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జానారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్, కేయూ ఎబివిపి ఇంచార్జీ డాక్టర్ నిమ్మల రాజేష్,అధ్యక్షులు ఉబ్బటి హరికృష్ణ, కార్యదర్శి జ్ఞానేశ్వర్ లతో పాటు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల నుండి దాదాపు 785 మంది ప్రతినిధులు, విద్యార్థులు, మరియు ఎబివిపి కార్యకర్తలు, , ప్రముఖులు పాల్గొన్నారు.