ప్రభుత్వ భూమిలో అక్రమ మదర్సా.. సీల్ చేసిన ప్రభుత్వం

అక్రమ మదర్సాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రుద్రపూర్ అనే ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన మదర్సాను ప్రభుత్వం మూసేసింది. ముఖ్యమంత్రి పోర్టల్ లో స్థానికులు చేసిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని, ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది.
మీడియా సంస్థల సమాచారం ప్రకారం కల్యాణి నది ఒడ్డున వున్న పహాడ్ గంజ్ లోని నాజుల్ భూమిలో అక్రమంగా నిర్మించడం, అక్రమంగా ఆక్రమించారన్న ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే మరో 8 అక్రమ భవనాలను కూల్చేయాలని కూడా జిల్లా యంత్రాంగం ఆదేశాలిచ్చింది. నిజానికి కల్యాణి నది పహార్ గంజ్ లోని ఈ ప్రాంతం యూపీ సరిహద్దును పంచుకొని వుంటుంది. యూపీ నుంచి వస్తున్న భూ మాఫియాలు ప్రభుత్వ భూమిలో హైందవేతరులను వుంచడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. దీని ద్వారా జనాభా అసంతులనానికి కుట్రలు చేస్తుంటారు. దీనిని అడ్డుకోవాలని ఉత్తరాఖండ్ సర్కార్ నిర్ణయించింది.
మరోవైపు అక్రమ నిర్మాణాల స్థలాల్లో నోటీసులు కూడా అతికించారు. సమీక్ష కోసం జిల్లా పరిపాలనా యంత్రాంగం అక్కడికి వెళ్లింది. ఈ సమయంలోనే అక్రమ మదర్సా కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ అక్రమ మదర్సాను సీజ్ చేశారు. మదర్సాకి సంబంధించిన పత్రాలను చూపించాలని కమిటీని అధికారులు ఆదేశించారు. మరోవైపు కళ్యాణి నది ఒడ్డున ఉన్న నాజుల్ భూమిలో అక్రమ ఆక్రమణలు మరియు అక్రమ నిర్మాణాలను ఆపడానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 20 నుంచి కూల్చివేతలు ప్రారంభించే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *