ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్ తాత్కాలికంగా మూసివేత
మహా కుంభమేళాకి జనం పోటెత్తుతున్నారు. ఇప్పటికే 40 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. రోజు రోజుకీ రద్దీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రయాగ్ రాజ్ సంగం రైల్వే స్టేషన్ ను మూసేస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలికంగానే మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భద్రత, ప్రయాణికుల సౌకర్యార్థం చేసినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా, రద్దీని నియంత్రించడానికి స్టేషన్ ను తాత్కాలికంగా మూసేశారు. యాత్రికుల సురక్షితం కోసం, దగ్గర్లోనే వుండే ఇతర రైల్వే స్టేషన్లకు రైళ్లను మళ్లిస్తున్నామన్నారు.
మరో వైపు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ లో ‘‘వన్ వే’’ ప్రణాళిక అమలులో వుంటుంది. దీని ప్రకారం ప్రయాగ్ రాజ్ జంక్షన్ వద్ద ప్రయాణికుల ప్రవేశం ప్లాట్ ఫారమ్ 1 వద్ద నగరం వైపు నుంచి మాత్రమే అనుమతిస్తారు. అయితే ప్లాట్ ఫారమ్ 6,10 నుంచి బయటికి వెళ్లాలి.