ఫిలిబిత్ లో ఘర్ వాపసీ : 1000 మంది తిరిగి హిందూ ధర్మంలోకి
యూపీలోని పిలిభిత్ జిల్లాలో మత మార్పిళ్లు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 3000 మందిని మత మార్పిళ్ల ముఠా మతాన్ని మార్చారు. దీంతో ఈ వార్త పెద్ద సంచలనమే రేపింది. ముఖ్యంగా సిక్కులే టార్గెట్ గా ఈ మిషన్ జరిగింది. అయితే… తాజాగా క్రైస్తవ మిషనరీలకు షాక్ తగిలింది. మతం మారిన వారు తిరిగి ఇప్పుడు హిందూ ధర్మంలోకి వచ్చేస్తున్నారు. మొత్తం 1000 మంది తిరిగి ఘర్ వాపసీ అయ్యారు.స్థానికంగా వుండే ధర్మాచార్యులు, హిందూ కార్యకర్తలు బాగా శ్రమించి, మతం మారిన వారిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొస్తున్నారు. క్రైస్తవ మిషనరీలు ఎలా ప్రలోభానికి గురి చేస్తాయి? వాటి నుంచి బయట పడటం ఎలా? అన్న దానిపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. దీంతో హైందవ ధర్మం వైభవాన్ని గ్రహించి, వారు తిరిగి హిందూ ధర్మంలోకి వస్తున్నారు.నేపాల్ సరిహద్దులో ఉన్న పిలిభిత్‌లోని గ్రామాలలో క్రైస్తవ మిషనరీలు నిరక్షరాస్యత మరియు ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని మతమార్పిడి చేస్తున్నారు. వీటితో పాటు విద్య, వైద్య, ఆర్థిక సహాయం వంటి ప్రలోభాలను కూడా మిషనరీలు చూపిస్తున్నాయి.
పిలిభిత్ జిల్లా హజారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బైలాహా, తాతార్‌గంజ్, బామన్‌పురా, భాగీరథ్, సింఘారా తదితర గ్రామాల్లో పెద్ద సంఖ్యలో సిక్కులను మతం మార్చారు.ఆ ప్రాంతాల్లో సుమారు 30వేల మంది సిక్కులు జీవిస్తున్నారు. వారిలో ఎక్కువమంది వ్యవసాయదారులు, మిగిలిన వాళ్ళు చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వారు. నేపాల్ సరిహద్దుల్లోని ఆ ప్రాంతాల్లో 2020 నుంచీ మత మార్పిడి కార్యక్రమాలు ఊపందుకున్నాయని స్థానిక ప్రజలు, సిక్కు సంస్థలూ గుర్తించాయి.
నేపాల్ నుంచి వచ్చిన ప్రొటెస్టెంట్ పాస్టర్లు ఈ మార్పిడి కార్యక్రమాలు ప్రారంభించారు. వారు మొదట స్థానికులు కొందరిని పాస్టర్లను చేసారు. ఆ పాస్టర్లు నిరుపేదలూ, చదువు లేనివారూ అయిన స్థానిక సిఖ్ఖులకు డబ్బులు ఆశపెట్టి, వ్యాధులు తగ్గిస్తామని కబుర్లు చెప్పి మతం మార్చారు.
అఖిల భారత సిక్కు పంజాబీ సంక్షేమ కౌన్సిల్ అధ్యక్షుడు హర్‌పాల్ సింగ్ ఈ తీవ్ర సమస్య గురించి వివరించారు. స్థానిక గురుద్వారా ‘శ్రీ సింగ్ సభ’లో మీడియాతో మాట్లాడుతూ పిలిభిత్‌లోని సిఖ్ఖు గ్రామాల్లో 3వేల మందికి పైగా సిఖ్ఖులను మతం మార్చారని వెల్లడించారు. అలా మతం మారిన 160 కుటుంబాల జాబితాను జిల్లా అధికారులకు సమర్పించారు.కొన్ని కుటుంబాలు తమ ఇళ్ళ మీద సిలువ గుర్తులు చిత్రించుకున్నాయి. జిల్లా అధికారుల జోక్యం వల్ల చాలామంది తమ ఇళ్ళ మీద అలాంటి చిహ్నాలను తొలగించారు.
ఈ విషయం మే 13న ఒక సిఖ్ఖు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. బైలాహా గ్రామానికి చెందిన మన్‌జీత్ కౌర్ హజారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్తను ఇప్పటికే క్రైస్తవంలోకి మతం మార్చేసారని, ఇప్పుడు తననూ తన పిల్లలనూ మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారనీ ఆమె ఆవేదన చెందుతోంది. మతం మారడానికి ఒప్పుకోకపోవడంతో ఆమె పొలాలను ధ్వంసం చేసారు, ఆమె పిల్లలపై భౌతికంగా దాడులు చేసారని ఆమె ఫిర్యాదు చేసింది.