బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన దాడులను ఖండించిన ట్రంప్
బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన మారణహోమంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్ తో అమెరికా సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తానని ప్రకటించారు. అల్లరి మూకలు హిందువుల ఇళ్లు, దుకాణాలను దోపిడీ చేశారని, దీంతో ఆ దేశంలో తీవ్రమైన భయానకర గందరగోళ పరిస్థితులు తలెత్తాయన్నారు.
తన సమయంలో ఎప్పుడూ అలా జరగలేదని, అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువులను కమలా, బైడెన్ విస్మరించారన్నారు. వామపక్షఅతివాదం నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేకత ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. హిందువుల స్వేచ్ఛ కోసం తాము పోరాడతామని తెలిపారు. మరోవైపు హిందువులకు ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. బంగ్లాదేశ్ లో హిందువులు, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలపై జరిగిన అనాగరిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు.