బంగ్లాదేశ్ లో హిందూ పాత్రికేయుడి దారుణ హత్య
బంగ్లాదేశ్ లోని హిందువులపై దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఓ వైపు దుర్గాదేవి మండపాల్లోకి చొరబడి ఇస్లామిక్ పాటలు, బలవంతంగా ఖురాన్ పఠనం లాంటివి ఓ వైపు ఛాందసులు చేస్తూనే వున్నారు. ఇవన్నీ మరిచిపోకముందే మరో ఘటన జరిగింది. తాజాగా అక్కడి ఇస్లామిక్ ఛాందసులు హిందూ పాత్రికేయుడ్ని (స్వపన్ భద్ర 65) దారుణంగా పొడిచి చంపారు. ఆయన ఇంటి ముందే ఈ ఘోరం జరిగింది. అక్కడి హిందువుల ఇబ్బందులను, కష్టాలను హైలేట్ చేస్తూ పాత్రికేయం చేస్తున్న హిందూ జర్నలిస్టులను ఛాందసులు తాజాగా టార్గెట్ చేస్తున్నారు. శంభుగంజ్ జిల్లాలోని మాజిపారా ఈయన స్వస్థలం. హిందువులకు అత్యంత పవిత్రమైన దసరా పండుగ రోజే జర్నలిస్టు స్వపన్ భద్రను కత్తితో పొడిచి చంపేశారు. వెంటనే కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
స్వపన్ భద్ర అక్కడి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా కూడా వున్నారు. అలాగే ‘‘డైలీ స్వజన్’’ అనే దిన పత్రికలో పనిచేశారు. పదవీ విరమణ తర్వాత సోషల్ మీడియా వేదికగా, ఇతర పత్రికల్లో హిందువుల బాధలను రాసేవారు. దీంతో అక్కడి ఛాందసులు బెదిరింపులకు దిగారు. అయినా… అత్యంత ధైర్య సాహసాలతో పాత్రికేయం చేస్తూ.. ఛాందసుల తప్పులను ఎత్తిచూపేవారు. చివరికి ఛాందసులు పొడిచి చంపేశారు.ఇక.. సాగర్ మియాన్ అనే ముస్లిం ఛాందసుడు ఫోన్ చేసి బయటికి రమ్మన్నాడు. దీంతో స్వపన్ భద్ర గదిలోంచి, బయటికి రాగానే కత్తితో పొడిచేశాడు.