బీజేపీకి ఓటేసిన వారిని చంపేస్తామని బెంగాల్ లో బెదిరింపులు
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా హిందువులపై దాడులు, హింస ఆగడం లేదు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని అమ్దాంగా నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ముస్లిం ఛాందసులు హిందువులను బెదిరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బీజేపీకి మద్దతిస్తున్నామని తమ ఇళ్లను ఛాందసులు ధ్వంసం చేశారని హిందువులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా బీజేపీకి మద్దతిచ్చినందుకు ముస్లిం ఛాందసులు తమ కుటుంబంలోని మహిళలపై దాడులు చేశారని, అత్యాచార బెదిరింపులకు కూడా దిగారన్నారు. హిందువులంతా ఆ ప్రాంతం నుంచి పారిపోయేలా ప్లాన్ వేస్తున్నారని హిందూ కుటుంబాలు పేర్కొంటున్నాయి.
స్థానికుల ప్రకారం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఉత్తర 24 పరగణాల జిల్లాలోని అమ్దంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇస్లామిస్ట్ శక్తులతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని బృందాలు ఇళ్లపై దాడి చేశాయని, బీజేపీకి ఓటు వేశారని అనుమానించిన వారిని బెదిరించాయని హిందూ కుటుంబాలు పేర్కొన్నాయి.
హింసాకాండ సమయంలో ఇళ్లను ధ్వంసం చేశారని, కుటుంబ సభ్యులపై దాడి చేశారని గ్రామస్తులు ఆరోపించారు. తమను ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారని చెప్పుకొచ్చారు. స్థానిక శక్తులు ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని వారు ఆరోపించారు.
‘
‘ఇస్లాం ఛాందసులు మిమ్మల్ని బెదిరిస్తున్నారు. దీంతో మేం బయట తిరగలేకపోతున్నాం. మా ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. మేము బీజేపీకి ఓటు వేశామన్న కారణంతోనే ఇదంతా. అలాగే మా కుటుంబాల వ్యక్తులను హత్య చేస్తామని కూడా బెదిరిస్తున్నారు. గత 14 సంవత్సరాలుగా మాది ఇదే పరిస్థితి’’ అని వాపోయారు.