బీఫ్ వడ్డన లేని హోటల్స్ మూసేయండి : ఛాందసుల డిమాండ్

బంగ్లాదేశ్ ఇస్లామిక్ ఛాందసులు ఓ హుకూం జారీ చేశారు. బంగ్లాదేశ్ లో బీఫ్ మాంసం (గొడ్డు మాంసం) అమ్మని రెస్టారెంట్లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ లో ముస్లిం కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఓ ర్యాలీ నిర్వహించింది. అన్ని హోటల్స్ మెనూలో కచ్చితంగా బీఫ్ అన్నది వుండాల్సిందేనని ఈ ర్యాలీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వాటిని మూసేయాల్సిందేనని పేర్కొన్నారు.ఒకవేళ బీఫ్ ను వడ్డించని పక్షంలో అవి ముస్లిం భావాలకు వ్యతిరేకమైన హోటల్స్ అంటూ ఏకపక్షంగా ప్రకటించారు. ఇస్లామిక్ జీవన విధానానికి బీఫ్ అనేది ఓ చిహ్నమని, తమ రెస్టారెంట్లలో హలాల్ ఆహారం లేని పాశ్చాత్య దేశాలు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయని కౌన్సిల్ కన్వీనర్ ముహమ్మద్ ఆరిఫ్ అల్ ఖబీర్ అన్నారు.
బీఫ్ లేని హోటల్స్ హిందుత్వ హోటల్స్ అని, అవి భారత ఏజెంట్ల హోటల్స్ అని ప్రకటించారు. వాటిని బహిష్కరించాలని బంగ్లాదేశ్ పౌరులకు పిలుపునిచ్చారు.ఒంటె మాంసం తినడం తప్పనిసరి కాదని వాదించాడు, అయితే ముస్లింలు ఒంటె తినడం విధిగా మారింది, ఎందుకంటే వారు యూదుల ఆహార నియమాలపై ఇస్లాం పట్ల తమ విధేయతను ప్రకటించుకోవాలని మహ్మద్ ఆరిఫ్ అల్ కబీర్ పేర్కొన్నారు.అలాగే బీఫ్ తినడం తప్పనిసరి కాదని, కానీ… హిందూ విశ్వాసాల కంటే ముస్లిం విశ్వాసాలపై విధేయతన చూపాల్సిన అవసరం వుందన్నారు.బంగ్లాదేశ్ లోని అన్ని హోటల్స్ తమ మెనూలో బీఫ్ ను వుంచి, ముస్లింలకు మద్దతివ్వాలని మహ్మద్ పిలుపునిచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *