భారత్‌ మాకు అనివార్య భాగస్వామి… ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి

భారత్‌ మాకు అనివార్య భాగస్వామి. అలాగే అత్యున్నత భద్రతా భాగస్వామి కూడా. ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. వాస్తవానికి ఇండో పసిఫిక్‌లో ప్రయత్నాలను సాగించడానికి భారత్‌ మాకు ఇప్పుడు అనివార్య భాగస్వామి.అలాగే ఎలక్ట్రిక్‌ వాహనాలు, సోలార్‌ ప్లేట్లను ఉత్పత్తి సరఫరా గొలుసులో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. సుస్థిరమైన ఇంధన విషయాలను ప్రోత్సహించడానికి ఇరు దేశాలు పెట్టుకున్న లక్ష్యానికి చేరువ అవ్వాలంటే ఇరు దేశాలకూ పరస్పర సహకారం అవసరం. గత ఐదు సంవత్సరాలలో ఆస్ట్రేలియా` భారత్‌ సంబంధాలలో వేగం పుంజుకుంది. మా దేశం ఇతర దేశాలతో నెరిపే అంతర్జాతీయ సంబంధాలలో అత్యంత వేగంగా అల్లుకున్న బంధమిది. ఇరు దేశాల బంధాలు బాగా బలపడటంతో సోలార్‌ ఎనర్జీ లాంటి రంగాలలో మరింత విస్తరించడానికి వీలైంది. రాబోయే మూడు సంవత్సరాలలో 10 మిలియన్ల సోలార్‌ ప్లేట్లను ఏర్పాటు చేయాలన్న భారత్‌ లక్ష్యం అద్భుతమైంది. ఇందుకు తాము కూడా సహకరిస్తాం.

-ఆస్ట్రేలియా రాయబారి ఫిలిప్ గ్రీన్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *