భారత్ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ.. తలవంచదు : పీయూష్ గోయల్
అగ్రరాజ్యం అమెరికా 50శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భారత్ వైఖరిని స్పష్టం చేశారు. భారత్ ఎవరికీ తలవంచదని తేల్చి చెప్పారు. ప్రపంచంలో భారత్ భవిష్యత్తుపై ఆయనను ప్రశ్నించిన సమయంలో ఆయన స్పందిస్తా చాలాబలంగా, నమ్మకంగా ఉందని తెలిపారు.
ఇది ఏటా 6.5శాతం వృద్ధి చెందుతోందని, ఇది వేగవంతం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రపంచం “డీగ్లోబలైజేషన్”ను ఎదుర్కొంటున్నదనే భావనను ఆయన తోసిపుచ్చారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు తమకోసం వాణిజ్య మార్గాలను, భాగస్వాములను పునర్నిర్వచించుకుంటున్నాయని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం భారతదేశం ఎక్కువగా ఎగుమతులు చేస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై, భారతదేశం విధానం కేవలం సుంకాల రాయితీలను కోరడం కంటే ఎక్కువగా ఉందని గోయల్ తెలిపారు. నాలుగు దేశాల ఈఈటిఏ గ్రూపుతో చర్చలను గుర్తు చేశారు.
భారత్‌ది నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని, మనకు యువ శక్తి ఉందని ఉందని తెలిపారు. ఈఈటిఏ సభ్య దేశాలు భారతదేశంలో 100 బిలియన్లను పెట్టుబడి పెట్టడానికి అంగీకరించాయని, దాంతో మిలియన్ ప్రత్యక్ష ఉద్యోగాలు, మొత్తం మీద 5 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయని భరోసా వ్యక్తం చేశారు.