భారత మాత సర్వస్వరూపి : తెలంగాణ గవర్నర్
భారత దేశ గొప్పదనం, చరిత్ర ప్రతి పిల్లవాడికీ తెలియాలని, పెద్దవారు చెప్పాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భారతీయ సంస్కృతి చాలా గొప్పదని, ముందు తరాలకు కూడా తెలియాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో భారత మాతకు మహా హారతి’’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.భారత మాత దేశానికి ప్రతీక అని, ఎవరికైనా అమ్మే తొలి గురువు అని అన్నారు. భారతమాత అంటే సర్వస్వరూపి, సమదృష్టి అని అర్థమని వివరించారు.
మరోవైపు కార్యక్రమ నిర్వాహకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఎనిమిదో సారి కార్యక్రమం నిర్వహించడమని, భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ భక్తిని పెంపొందిండమే ఈ భారత మాత మహారథి కార్యక్రమం ఉద్దేశమని వివరించారు. ప్రతి సారీ ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని తెలిపారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నారని, భారతీయ సంప్రదాయం పట్టం కట్టే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణి శర్మ, సంగీత దర్శకుడు కీరవాణి ఇతరులు పాల్గొన్నారు.