మంచుఖండం అధ్యయన బృందానికి విశాఖ వాసి నాయకత్వం
పర్యావరణ అధ్యయనం కోసం మంచుఖండం అంటార్కిటికా వెళ్తున్న భారత శాస్త్రవేత్తల బృందానికి మన్యంవాసి పరదాని రమణమూర్తి నాయకత్వం వహిస్తున్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీ ఉక్కుర్బా గ్రామానికి చెందిన రమణమూర్తి పేద కుటుంబంలో జన్మించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీలో బయోఫిజిక్స్ పూర్తిచేశారు. విశాఖపట్నంలోని భారతీయ భూ అయస్కాంత పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం (2024-25) అంటార్కిటికా ఖండానికి భారత శాస్త్రవేత్తల బృందం పర్యావరణంపై అధ్యయనానికి వెళ్తోంది. గిరిజన ప్రాంతంలో పుట్టి శాస్త్రవేత్తగా ఎదిగి భారత శాస్త్రవేత్త బృందానికి నాయకత్వం వహిస్తూ అంటార్కికా ఖండానికి వెళ్లడం గర్వకారణంగా ఉందని ఎంపీ తనూజారాణి అభినందించారు.