మనది దైవీ జాతీయవాదం

సాత్వికప్రవృత్తితో కూడిన జాతీయతకు అంటే దైవీ జాతీయవాదానికి మనం వారసులం. ఈ చరాచర సృష్టి ఆరంభంలోనే, మహానుభావులైన మన పూర్వులు యోచించి ఆ నిర్ణయానికి వచ్చారు. ఇదే పరంపరకు సాకారమూర్తులుగా భగవాన్‌ శ్రీ‌రాముడు, భగవాన్‌ శ్రీ‌కృష్ణుడు మున్నగువారు ఇచ్చట అవతరించారు. చంద్ర గుప్తమౌర్యుడు రాజ్యాధికారాన్ని సంపాదించిన మరుక్షణం తనకై ఏదీ ఆశించకుండానే సరాసరి అరణ్యానికి పయనమైన ఆర్య చాణక్యుడు, విజయనగర సంస్థాపనానంతరం సన్యాసాన్ని స్వీకరించిన మాధవాచార్యులు ఇదే పరంపరకు చెందిన శ్రేష్ట పురుషులు. మనం ఆ పరంపరకు వారసులం. కనుకనే అలాంటి ఈశ్వరీయమైన హిందూ జాతీయతను పునఃప్రతిష్టించడానికే రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌కృతనిశ్చయమై ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *