‘‘మన వృత్తులను కాపాడుకోకపోతే.. ఇతర మతస్థుల చేతుల్లోకి వెళ్లిపోతాయి’’

శ్రీ సోమేపల్లి సోమయ్య స్మారక అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో కమలానగర్ లో చేతి వృత్తులు – చిరువ్యాపారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దీనిలో విశ్వకర్మ, నాయి బ్రాహ్మణ, పద్మశాలి, మేస్త్రీ , గంగిరెద్దుల వారు, మాలదాసరి, రజక, మేదరి, స్ట్రీట్ vendors, మొదలైన వృత్తుల వారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ వృత్తులలో ఎదురు అవుతున్న సమస్యలు వాటిని అధిగమించడానికి చేయవలసిన పనుల గురించి విస్తృతంగా చర్చించారు.సమస్యల పరిష్కారం దిశగా ప్రగతిని సమీక్షించడానికి ప్రతి 3 నెలలకు ఒకసారి కలు వాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా సామాజిక సమరసత అఖిల భారత సంయోజక్, ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ మన వృత్తులని మనం కాపాడుకోలేకపోతే, ఈ వృత్తులు చేసేవాళ్లని పరస్పరం గౌరవించుకోకపోతే, ఆ వృత్తులు చేసుకోవడానికి నామోషీపడితే ఇతర మతస్థులు ఆ వృత్తులు చేపట్టి, ఆ వృత్తిదారుల సంప్రదాయ, సంస్కృతులని గౌరవించరన్నారు. ; గతిలేక వారినే మన ఇళ్లలోకి పిలుచుకోవాల్సిన దుర్భర పరిస్థితులు మొదలయ్యాయని చెప్పారు. మన పిల్లలు చదువుకున్నా వృత్తిని నేర్చుకోవడం, దానిపట్ల గౌరవం ఉండాలని చెప్పారు.

అంతేగాక కులానికి సంబంధించిన వారేకాక ఆసక్తి ఉన్న ఇతర హిందూకులాల వారు స్వీకరిస్తే (మిగతా మతాలవాళ్ల బదులు) మన సంస్కృతీ సభ్యతలు నిలబడతాయనీ చెప్పేరు. మన ఇళ్లలో జరిగే ఉత్సవాల్లో కూడా నాదస్వరం, గంగిరెద్దులాట, మిగతావృత్తులు వాళ్ల నీ పిలిచి వారికి కూడ బట్టలు పెట్టడం, అందరితో కలిపి భోజనాలూ పెట్టడం చేయాలనీ పరస్పరం గౌరవించుకోవాలనీ చెప్పారు. అంతేగాక అంత్యక్రియలలో కూడ ఏ రకమైన భేషజాలూ లేకుండ పరస్పరం సహకరించుకోవాలనీ చెప్పేరు. ఇతరమతస్థులకి మన ఇళ్లలోకి వచ్చి మన ఆడవారి భద్రతకు ముప్పుతెచ్చుకొనే పరిస్థితులు తెచ్చుకోవద్దని మనవృత్తుల్ని కాపాడుకుంటూ మనం కలిసి ఉండాలనీ ఉద్బోధించారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ నేత రవిశంకర్ ఈ సందర్భంగా రకరకాల చట్టాల (స్ట్రీట్ వెండర్స్, బిల్డింగ్ వర్క్) వివరించారు.జనహిత శ్రీ గణేశ్ యనమండ్ర జనహిత ద్వారా ఇచ్చే ఉచిత వృత్తి ట్రైనింగ్స్, సహాయక్ యాప్ ద్వారా మన హిందువులే మన యిళ్లలో రకరకాల రిపేర్స్ (ఏసి, ఫ్రిడ్జ్, వాటర్ ఫిల్టర్స్, ఎలక్ట్రికల్,మరి అన్నివిధాల గృహోప పనులను వివరించారు. రామకృష్ణ బ్యాంకు రుణాలకి సహకరిస్తమనీ, పోష్టల్ ఇన్స్యూరెన్స్, ఇతర బెనిఫిట్స్ పై అరుణ్ జీ చెప్పగా, వేంకటాచారి వందన సమర్పణ చేశారు.

సమావేశాన్ని బుద్ధవరపు ప్రభాకర్ , విష్ణుభట్ల రామచంద్ర విజయవంతంగా నిర్వహించగా, సమితి అధ్యక్షులు రేమెళ్ల వేంకటేశ్వర్లు, భాగ్ సంఘచాలక్ డా. నాగమోహన్ , సమితిసభ్యులూ, క్షేత్ర ప్రచారక్ ప్రముఖ్ గొట్టుముక్కల భాస్కర్ కూడ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *