మహా కుంభమేళా అపురూప ఘట్టం : ఎరిక్ సోల్ హీమ్
భారత దేశ ప్రాచీన జ్ఞానం, భారతీయులకు ప్రకృతిపై వుండే భక్తి అమోఘమని నార్వేజియన్ మాజీ మంత్రి,మాజీ యుఎన్‌ఇపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్‌హీమ్ ప్రశంసించారు. ఆయన మహాకుంభమేళాలో పవిత్ర స్నానమాచరించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం అద్భుతమైన అనుభవం అని ఆనందం వ్యక్తం చేశారు.
మహా కుంభమేళా అపురూపమైన ఘట్టమని పేర్కొన్నారు. మానవులు కూడా ప్రకృతిలో భాగమేనని భారతీయ తత్వశాస్త్రాలు పేర్కొన్నాయని, పాశ్చాత్య ఆలోచనలు ఇందుకు భిన్నంగా వుంటాయన్నారు. భారతీయ సంస్కృతి నదులు, అడువులు, జంతువులు, పక్షులు, మాతృభూమిని ఎంతో గౌరవిస్తుందన్నారు. ప్రజలు కూడా ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తుంటారని పేర్కొన్నారు. కుంభమేళా అనేది కేవలం ఆచారమో, సంప్రదాయమో కాదని, ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడంగా ఆయన అభివర్ణించారు.
హిందూ దేవతలు గణేషుడు, హనుమంతుడు అద్భుతమైన దేవతలని కొనియాడారు. అలాగే భారతీయ సంప్రదాయాలు కూడా అద్భుతమైనవని, ప్రపంచానికి దారి చూపిస్తాయన్నారు. ప్రకృతిత మమేకం కావడం భారతీయుల ఆచారమని, భారతీయ సంస్కృతి ఆధునిక ప్రపంచానికి విలువైన మార్గదర్శనం అందిస్తుందని ఎరిక్ సోల్ హీమ్ అన్నారు.