మాక్ డ్రిల్స్ లో పాల్గొని.. శిక్షణ పొందండి : VHP పిలుపు

దేశ వ్యాప్తంగా బుధవారం జరగనున్న మాక్ డ్రిల్ లో స్థానిక యంత్రాంగంతో కలిసి పాల్గొని, శిక్షణ పొందాలని విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు VHP జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ పేరుతో ఓ పత్రికా ప్రకటన మంగళవారం విడుదలైంది. యుద్ధ అత్యవసర సమయంలో జాతీయ భద్రత మరియు పౌరులు నిర్వహించాల్సిన బాధ్యత అవగాహన కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు బుధవారం దేశ వ్యాప్తంగా జరగబోయే మాక్ డ్రిల్ లో యావత్ పౌర సమాజం పాల్గొనాలని అందులో పిలుపునిచ్చారు. యావత్ పౌర సమాజం ఎక్కడికక్కడ స్థానిక ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై శిక్షణ తీసుకోవాలని తాము భారత సమాజాన్ని కోరుతున్నామని వీహెచ్ పీ కోరింది. భజరంగ్ దళ్, దుర్గావాహిని కార్యకర్తలు సంపూర్ణ శిక్షణ పొంది, అత్యవసర పరిస్థితుల్లో సమాజానికి రక్షణగా నిలిచేవిధంగా సిద్ధంగా వుండాలని వీహెచ్ పీ పిలుపునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *