మారిషస్ లో అమ్మ పేరు మీద మొక్క నాటిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మారిషస్ జాతిపిత సీవోసాగర్ రాంగులాం పేరిట ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ తన అమ్మపేరు మీద ప్రధాని మోదీ ఓ మొక్కను నాటారు. మారిషస్ ప్రధాని రాంగులాం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి, మాతృత్వం, స్థిరత్వానికి గుర్తుగా ఈ మొక్క నిలుస్తుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇక.. భారత్ – దక్షిణార్థ గోళ దేశాలకు మధ్య మారిషస్ వారధి వంటిదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మారిషస్ కేవలం భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, భారత దేశ కుటుంబంలో ఓ భాగమని, మినీ ఇండియా అని అభివర్ణించారు.