మా ప్రాంతంలో మైనారిటీ గురుకులం వద్దు : ఆదివాసీల డిమాండ్

షెడ్యూల్‌ ఏరియా ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాలను రద్దు చేయాలని జైనూర్‌ ఆదివాసి సంక్షేమ పరిషత్‌ డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో జైనూర్‌ తాహశీల్దార్‌కి ఓ వినతి పత్రాన్ని అందజేసింది. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఐదో షెడ్యూల్‌1/70 నిబంధనల ప్రకారంగా షెడ్యూల్‌ ప్రాంతంలో మైనారిటీ గురుకులానికి అనుమతి ఇవ్వరాదని స్పష్టంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాలను ప్రభుత్వం రద్దు చేయాలని వారు కోరారు. 1997 లో సుప్రీం కోర్టు ‘‘సమత’’ తీర్పు ప్రకారం షెడ్యూల్‌ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా నాన్‌ ట్రైబల్స్‌గా గుర్తించిందని గుర్తు చేశారు. అలాంటి ప్రాంతంలో మైనారిటీ గురుకులాన్ని ఏర్పాటు చేయడమంటే భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని కూడా అవమానించడమే అవుతుందని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జైనూరులో హిందువులపై ముస్లింలు మూకదాడికి దిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆదివాసీ యువకుడైన మర్సుకోల లక్ష్మణ్‌పై గిరిజనేతర వర్గం దాడికి దిగింది. దీంతో తమ ఆదివాసీ సమాజంపై దాడులు జరుగుతున్నాయని ఆదివాసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలు తీర్మానాలను కూడా వారు చేసుకున్నారు. ఈ తీర్మానాల ఆధారంగానే మైనారిటీ గురుకులాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *