మిషన్ గగన్‌యాన్ వ్యోమగాముల ప్రాథమిక శిక్షణ పూర్తి
గగన్‌యాన్ మిషన్ లో భాగంగా ఇద్దరు యాత్రీకులు ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నట్లు ఇస్రో తెలిపింది. నాసా, ఇస్రో ఆధ్వరంలో ఇద్దరు భారతీయ వ్యోమగాములు అమెరికాలో శిక్షణ పొందినట్లు వెల్లడించింది. ప్రైమ్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, బ్యాకప్ గ్రూపు కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ లు ఈ ఏడాది ఆగస్టు నుంచి శిక్షణలో ఉన్నట్లు ఇస్రో తెలిపింది.
మిషన్ సంబంధిత గ్రౌండ్ ఫెసిలిటీ టూర్స్, మిషన్ లాంచ్ ఫేస్, స్పేస్ఎక్స్ సూట్ ఫిక్స్ చెక్స్, ఫుడ్ ఆప్షన్స్ విషయాల్లో శిక్షణ తీసుకున్నారు. స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ గురించి కూడా భారతీయ వ్యోమగాములు తెలుసుకున్నారు.అంతరిక్షంలో ఏర్పడే అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై తొలి దశ శిక్షణలో వివరించారు. నవంబర్ 28తో తొలి దశ శిక్షణ ముగిసింది.