మీ హిందూ దేవతలకు శక్తి లేదు.. మా ఖురాన్ చదవండి… ఢిల్లీ కోచింగ్ సెంటర్‌లో హిందూ విద్యార్థులఫై ఒత్తిడి

ఢిల్లీ షకుర్‌పూర్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌ హిందూ విద్యార్థులపై తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. అక్కడి హిందూ విద్యార్థులు కచ్చితంగా ఖురాన్‌ చదవాల్సిందేనని, కల్మా కూడా చదవాలని యాజమాన్యం తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. తమ దేవీ దేవతలను ఆరాధించడం మానేసి, తమ అల్లాను మాత్రమే ఆరాధించాలంటూ హిందూ విద్యార్థులపై తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. దీంతో ఓ విద్యార్థి ఈ విషయాన్ని తన కుటుంబీకులకు తెలియజేశాడు. వెంటనే తలిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము మొదట్లో కోచింగ్‌ కోసం ఇనిస్టిట్యూట్‌లో చేర్పించిన సమయంలో సంజయ్‌ అనే వ్యక్తి వుండేవాడని, తర్వాత అబ్రార్‌, ఇర్ఫాన్‌ అనే వాళ్లు విషయ బోధన చేస్తున్నట్లు తమకు తెలిసినందని, ఆ తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేశారు. ఈ మధ్య తరుచుగా తమ పిల్లవాడు ఇంట్లో ఖురాన్‌ గురించే తమను అడుగుతున్నాడని, దీంతో అసలు విషయం బయటపడిరదని తల్లిదండ్రులు వెల్లడించారు.
అయితే మొదట్లో తమ పిల్లవాడ్ని అంతగా పట్టించుకోలేదని, తరుచుగా ఖురాన్‌ ప్రస్తావన తెస్తున్నాడని, విషయంపై ఆరా తీయగా.. తమకు రిజ్వాన్‌ అనే వ్యక్తి బోధిస్తున్నాడని, ఖురాన్‌ చదవాల్సిందేనని తమపై పదే పదే ఒత్తిడి తెస్తున్నాడని తమ పిల్లవాడు తమకు చెప్పినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. ‘‘మీ హిందూ మతం వేస్ట్‌ మతం. మీ దేవతలలో శక్తి లేదు. అందుకే మీరు ఖురాన్‌ చదవాలి. కల్మా చదవాలి. వాటిల్లో చాలా శక్తి వుంది. వీటిని చదివితే మీరు బలవంతులు అవుతారు.’’ అంటూ కోచింగ్‌ సెంటర్‌‌లో పదే పదే చెబుతున్నారు. దీంతో ఈ విషయంపై తాము అడిగితే.. తమనే తిడుతున్నారని, దుర్భాషలాడుతున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
అయితే.. ఈ విషయంపై జర్నలిస్ట్‌ స్వాతి గోయల్‌ శర్మ స్పందించారు. తాను విద్యార్థుల తలిదండ్రులతో మాట్లాడానని, మైనర్‌ హిందూ అబ్బాయిలను ఇస్లాంలోకి మార్చేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని, అయితే.. కోచింగ్‌ సెంటర్‌ పేరు జై మాతాది, అని రాసి వుందని తెలిపారు. అయితే మొదట్లో సంజయ్‌ అనే వ్యక్తి బోధన చేసేవాడని, ఆ తర్వాత రిజ్వాన్‌, అబ్రార్‌ వంటి వ్యక్తులు బోధనకు వచ్చారని గోయల్‌ శర్మ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *