మూఢ విశ్వాసాలను తొలగించాలి
మూఢ విశ్వాసాలు సహజంగానే తప్పక మారిపోతాయి. బలవంతంగా వాటిని తొలగించనక్కరలేదు. అసలు పురాతన హిందూ ధర్మపు తత్వ జ్ఞానం నేటి విజ్ఞానంతో ఎలా సమన్వయమవుతుందో వివరించి చెప్పాలి. ఈ పని ధర్మగురువులు చేయాలి. వారు అన్ని చోట్లా పర్యటిస్తూ ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రసరించే వెలుగులో ఎలా శృతి స్మృతులలో చెప్పిన ధర్మం శాశ్వతంగా నిలుస్తుందో వివరించి చెప్పాలి. మూఢ విశ్వాసాలు కాలానుగుణంగా మారుతూనే ఉంటాయి. కాని వాటిని బలవంతంగా మార్చిచూచే ప్రయత్నంలో, ప్రాచీన పరంపరకే దెబ్బతగులుతుంది. ఆ హాని చాలా పెద్దది. అలాంటి దెబ్బ తగలకుండా మూఢ విశ్వాసాలను తొలగించాలి. కనుక ధర్మానికి మూలమైన తత్వజ్ఞానపు శాశ్వత స్వరూపాన్ని ఆధునిక పరిభాషలో ప్రచారం చేస్తూ, దాన్ని ఆధారంగా చేసుకునే సమాజాన్ని నిలబెట్టాలి.