మెంతి ఆకు
మనం తినే ఆహారంలో ఆకుకూరల్లో ఒకటి మెంతి ఆకు. దీనిని ఆకుకూరగా ఉపయోగిస్తారు. మెంతులు కాస్తంత చేదు ఆనిపిస్తాయి. కానీ ఆకుకూర మాత్రం మంచి రుచికరమైంది. ఈ మెంతిఆకులో అనేక ఔషధ గుణాలున్నాయి. మెంతి ఆకులు ఆర్థరైటిస్ నివారణకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. మెంతి ఆకులను రోజుకు రెండుసార్లు తీసుకుంటే, అది శరీరం నుండి వచ్చే వ్యర్థాలన్నింటినీ బయటకు తీసి పేగులను శుభ్రపరుస్తుంది. ఈ ఆకులో అనేక విటమిన్లు, పోషక పదార్థాలతో పాటు విటమిన్ కె కూడా లభిస్తుంది. పచ్చిగా ఉన్నప్పుడు మెంతి ఆకు అని.. దానిని ఎండబెట్టి కసూరి మేథీ అని అంటారు.. మెంతి ఆకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
– ఈ మెంతులు ఆశ్వయుజ కార్తీక మాసాల్లో చల్లితే చల్లిన నెలా పదిహేను రోజుల్లొ మెంతికూర ఉపయోగించడానికి అనువుగా ఎదుగుతాయి.
– నల్లనేలల్లో శీతాకాలంలో వేసిన మెంతికూర చాలా రుచిగా ఉంటుంది.
– మెంతికూర పచ్చిగా ఉన్నప్పుడు కాని, ఎండపెట్టి వరుగు చేసి కాని ఉపయోగించుకోవచ్చు.
– రక్తపిత్తం, అగ్నిదీప్తి, మలాన్ని బందించును, బలాన్ని కలిగిస్తుంది.
– జ్వరం, వాంతి, వాతరక్తం, కఫం, దగ్గు, వాయువు అనగా వాతం, మూత్రరోగం, క్రిమి, క్షయ, శుక్రం వీటిని నశింపచేస్తుంది.
– ఈ ఆకులు నూరిన ముద్ద కాలిన పుండ్లకు, వాపులకు పట్టువేస్తే చల్లగా ఉండి మేలు చేస్తుంది.
– ఈ మెంతిఆకులు నూరి ముద్దకడితే వెంట్రుకలు మృదువుగా అవుతాయి.వెంట్రుకలు రాలే జబ్బు తగ్గుతుంది.
– స్త్రీల గర్భాశయాన్ని బాగుపరచడంలో మెంతికూర బాగా పనిచేయును .
– ఈ మెంతిఆకుల వల్ల కలిగే దోషాల్ని పోగొట్టడంలో పులుసు వస్తువులు వాడాలి.
– ఉషాలావణ్య పప్పు