‘‘మేము హిందువులం’’ అని చెప్పగానే.. కాల్పులు జరిపిన ఇస్లామిక్ ఉగ్రవాదులు
జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో హిందువులే లక్ష్యంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేశారా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ‘‘మీది ఏ మతం?’’ అని అడిగినట్లు ఓ మహిళ పేర్కొంది. ‘‘తాము భేల్ పూరీ తింటున్నాం. ఈ సమయంలో ఉగ్రవాది దగ్గరికి వచ్చి మీది ఏమతం? అని అడిగాడు. తాము హిందువులం అని చెప్పాం’’ అని మహిళ పేర్కొంది. ఈ సమాధానం తర్వాతే విచక్షణా రహితంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కారణంగానే హిందువులే లక్ష్యంగా ప్రణాళికలు రచించారా? అన్న అనుమానాలు వస్తున్నాయి.
మరోవైపు కాల్పులు జరిగిన ప్రాంతంలో మహిళలు రోదనలు వింటుంటే అత్యంత బాధకలిగిస్తోంది. ‘‘నా భర్త తలపై కాల్పులు జరిపారు. దయచేసి సహాయం చేయండి.. ప్లీజ్’’ అంటూ ఓ మహిళా పర్యాటకురాలు వేడుకుంది.
ఇక… ఈ ఘటన జరిగిన తర్వాత మిగతా పర్యాటకుల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. అక్కడే వున్న పర్యాటకులను మీడియా ప్రతినిధులు పలకరించగా.. ‘‘కొంచెం భయపడుతున్నాం. తిరిగి ఇంటికి వచ్చేయండి అని మా ఇళ్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అంతలోనే స్థానికులు మా దగ్గరికి వచ్చారు. ఏం భయం లేదు. తాము వుంటామని, ఇక్కడే వుండమని చెప్పారు.’’ అని పర్యాటకులు పేర్కొన్నారు.