‘‘మోస్ట్ వాంటెడ్’’ జకీర్ నాయక్ కి పాక్ ఆతిథ్యం… భారత్ మండిపాటు

భారత్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తి, వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ కి పాక్ ఆతిథ్యం ఇచ్చింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్ లో జకీర్ నాయక్, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్ ను కలిసిన తర్వాత పాక్ వైఖరేమిటో ఇట్టే తెలిసిపోయిందని వ్యాఖ్యానించింది.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. న్యాయం కోసం జకీర్ నాయక్ ని అప్పగించాలని భారత్ కోరుతుంటే.. పాకిస్తాన్ ఆయనకు ఆతిథ్యం ఇచ్చిందని, ఇదేం వైఖరి? అంటూ దుయ్యబట్టారు. అయితే.. వివాదాస్పద ఇస్లాం బోధకుడు జకీర్ ని ఆహ్వానించడం ఇదేం తొలిసారి కూడా కాదని దెప్పిపొడిచారు. భారత్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తికి పాక్ ఆతిథ్యం ఇవ్వడం చూస్తే… దాని అర్థం ఏమిటో తెలిసిపోయిందన్నారు.

పంజాబ్ సీఎం మరియం నవాజ్ ను, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను జకీర్ నాయక్ రైవిండ్ లోని నివాసంలో కలిసినట్లు పత్రికలు పేర్కొన్నాయి. జకీర్ నాయక్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ నాయకులు వివిధ అంశాలపై చర్చించారు. అయితే.. ఏయే అంశాలు చర్చకు వచ్చాయో మాత్రం బయటికి రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *