యూనివర్శిటీ గోడలపై ఆజాద్ కశ్మీర్, ఫ్రీ పాలస్తీనా’’ నినాదాలు
బెంగాల్ లోని జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం మరోసారి వివాదానికి కేంద్ర బిందువైంది. క్యాంపస్ గోడలపై ‘‘ఆజాద్ కశ్మీర్, ఫ్రీ పాలస్తీనా’’ అన్న నినాదాలు కనిపించాయి. దీంతో తీవ్ర చర్చకు దారితీసింది. విశ్వవిద్యాలయం గేటు నెంబర్ 3 సమీపంలో వుండే గోడపై ఈ నినాదాలు కనిపించాయి. ఫాసిస్ట్ శక్తులను నిర్మూలించాలని కూడా రాసి వుంది. అయితే.. ఈ రాతల వెనుక ఎవరున్నారన్నది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు.
మార్చి 1 న వామపక్ష విద్యార్థి సంఘాల నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో వామపక్ష విద్యార్థి సంఘాలకు, మంత్రికి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మంత్రి కాన్వాయ్ లోని వాహనాలు విద్యార్థులను ఢీకొంటూ వెళ్లాయి. దీంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో తృణమూల్ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలకు, వామపక్ష విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ మధ్య ఉద్రిక్తతలు పెంచింది. అప్పటి నుంచి ఈ విశ్వవిద్యాలయం వార్తల్లో నిలిచింది. విద్యార్థులు తమ డిమాండ్లతో వున్న మెమోరండాన్ని మంత్రికి సమర్పించడానికి ప్రయత్నించగా ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనను నిరసిస్తూ SFI, SUCI (కమ్యూనిస్ట్) యొక్క ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (AIDSO), నక్సలైట్ రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫ్రంట్ (RSF), మరియు నక్సలైట్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ముందు ధర్నాను నిర్వహించాయి. దీని తర్వాత ఇరు పక్షాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనల తర్వాతే యూనివర్శిటీ గోడలపై రాతలు కనిపించాయి.