రాంలల్లా వెండి నాణెం విడుదల… ఎంతంటే

తాజాగా కేంద్ర ప్రభుత్వం 50 గ్రాముల అయోధ్య రామాలయ వెండి నాణేలను ప్రజలకు విక్రయించేందుకు రిలీజ్‌ చేసింది. 50 గ్రాముల బరువున్న ఈ నాణెం ధర 5,860 రూపాయలుగా వుంటుంది. ఇది 999 స్వచ్ఛమైన వెండితో తయారు చేసినట్లు పేర్కొంది. దీనిని ఎస్‌పీఎంసీఐసీఎల్‌ఐ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నాణెంలో ఓ వైపు రామ్‌ లల్లా విగ్రహం, మరోవైపు రామాలయ ఫొటో కనిపిస్తుంది.ఈ నాణెం కొనుగోలు చేసిన వారు, తమ పూజా మందిరంలో వుంచుకోవచ్చని, లేదా.. ఎవరికైనా బహుమానంగా కూడా ఇచ్చుకోవచ్చని ట్రస్ట్‌ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *