రామ మందిర నిధి సమర్పణ కార్యక్రమం దేశాన్ని ఐక్యం చేసింది

అయోధ్యలో నిర్మించనున్న శ్రీరామ మందిర నిర్మాణానికి చేపట్టిన నిధి సమర్పణ కార్యక్రమం దేశంలోని నలుమూలల్లో ఉన్న ప్రజలను ఐక్యం చేసిందని విశ్వ హిందూ పరిషత్‌ ‌జాతీయ ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (ట్రస్ట్) ‌ప్రధాన కార్యదర్శి చంపత్‌ ‌రాయ్‌ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయం నిర్మాణం కోసం 2021 జనవరి 15 నుండి ఫిబ్రవరి 27 వరకు చేపట్టిన నిధి సేకరణ కార్యక్రమంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద జనజాగరణ కార్యక్రమం అని అన్నారు.

దేశ వ్యాప్తంగా సుమారు 4లక్షల గ్రామాలలో నిధి సమర్పణ కార్యక్రమం విజయవంతమైందని ఆయన తెలిపారు. పల్లెలు, పట్టణాలు ఇలా అన్ని రకాల ప్రాంతాల్లో నిధి సమర్పణ కార్యక్రమం జరిగిందని అన్ని చోట్లకి కార్యకర్తలు వెళ్లారని తెలిపారు. దేశంలో సుమారు 100 మిలియన్ల (పది కోట్ల) కుటుంబాలు నిధి సమర్పణలో పాలు పంచుకున్నాయని తెలిపారు. రాముడి గుడి కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎన్నో మధురమైన సంఘటనలు ఎదురయ్యాయని, ఎంతో మంది భక్తులు తమకు తోచిన విధంగా సమర్పణ చేసి వారి భక్తిని చాటు కున్నారని తెలిపారు. రోజువారి కూలీలు, నిరుపేద కుటుంబాలు, యాచకులు కూడా తమ వంతుగా నిధి సమర్పించి ఈ మహత్తర మైన కార్యంలో భాగస్వాములైనందుకు సంతోష పడ్డారని తెలిపారు.ఈ జనజాగరణ కార్యక్రమంలో మొత్తంగా 175,000 జట్లలో సుమారు 9 లక్షల మంది కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నిధి సేకరించినట్టు తెలిపారు. సేకరించిన మొత్తాలను బ్యాంకుల్లో జమ చేశారని తెలిపారు. కార్యక్రమ పారదర్శకతను కాపాడటానికి దేశవ్యాప్తంగా 49 కంట్రోల్‌ ‌రూములు ఏర్పాటు చేశారని, ఢిల్లీలోని ప్రధాన కేంద్రంలో ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్ల నేతృత్వం లోని 23 అర్హత కలిగిన కార్యకర్తలు ఖాతాలను పర్యవేక్షిస్తూ నిరంతరం సంప్రదింపులు జరుపు తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ధనుష్‌ ఇన్ఫోటెక్‌ ‌కంపెనీ రూపొందించిన యాప్‌ ‌కార్యకర్త లకు, బ్యాంకులకు, ట్రస్ట్‌కు మధ్య డిజిటల్‌ ‌వారధిగా పనిచేయడానికి దోహదపడిందని తెలిపారు. తుది గణాంకాలు ఇంకా రాకపోయినా, మార్చి 4 వరకు బ్యాంకుల రశీదుల ఆధారంగా సమర్పణ మొత్తం రూ.2500కోట్లు దాటుతుందని ఆయన అన్నారు. ఈ నెలలో దేశంలోని ప్రతి జిల్లాలో ఆడిట్‌ ‌కూడా పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశాన్య ప్రాంతాలైన అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లో రూ. 4.5కోట్లు, మణిపూర్‌లో 2కోట్లు, మిజోరంలో రూ.2.1 కోట్లు, నాగాలాండ్‌లో రూ. 2.8కోట్లు, మేఘాలయ లో 8.5 కోట్ల రూపాయల నిధి ప్రజలు సమర్పించినట్లు తెలిపారు. అలాగే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు లో రూ.85కోట్లు, కేరళలో రూ.13కోట్లు సమర్పించినట్లు తెలిపారు.

ఇప్పటి వరకు నిధి సమర్పణ చేయని వారు కూడా https://srjbtkshetra.org/donation-options వెబ్‌సైట్‌ ‌ద్వారా శ్రీరామ జన్మభూమ తీర్థ క్షేత్ర ఖాతాకు నేరుగా సమర్పణ చేయవచ్చని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *