రైతులకు ఆర్ధిక పుష్టినిచ్చే చెట్లు ఇవే… అతి తక్కువ సమయం… ఎక్కువ డబ్బులు
చెట్లు కేవలం నీడను మాత్రమే కాదు.. ఆదాయాన్ని కూడా తెచ్చిపెడతాయి. కావల్సిందల్లా కాస్త ఓపిక అంతే. చెట్ల పెంపకం ద్వారా చాలా లాభాలు గడిరచవచ్చు. రైతులకు పెద్దగా ఖర్చు కూడా వుండదు. చెట్ల పెంపకంలో రైతులకు విపరీతంగా ఆదాయం పెరుగుతుంది. అయితే.. మార్కెట్‌లో 4 రకాల చెట్లకు విపరీతమైన డిమాండ్ వుంది.
1. టేకు చెట్లు : టేకు కలపకు మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్ వుంటుంది. ఇది చాలా బలమైన కర్ర. టేకు చెట్లను పెంచుతూపోతే చాలా డబ్బు సంపాదించవచ్చు. రైతులకు కూడా చాలా మేలు చేస్తుంది. కాకపోతే ఓపిక కావాలి.
2. గంధపు చెట్లు : అత్యంత ఖరీదైన చెట్లలో ఒకటి. దీని కలప చాలా ధర పలుకుతుంది. గంధం చెక్కను మార్కెట్‌లో కిలో 27 వేల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. చందనం చెట్ల పెంపకం ద్వారా మంచి లాభం పొందవచ్చు. దేశంలో చాలా తక్కువ ప్రాంతాల్లో గంధం చెట్లను సవగు చేస్టారు . లాంగ్ టర్మ్‌లో 5 లక్షల రూపాయల ఆదాయం వుంటుంది. ఒక ఎకరా పొలంలో 600 గంధపు చెక్కలు, 300 హోససట ప్లాంట్లు వేస్తారు.
3. మహోగని చెట్టు : విలువైన చెట్లలో ఒకటి. ఈ చెట్టులోని దాదాపు ప్రతి భాగం చాలా విలువ వుంటుంది. కాబట్టి దీనిని రైతులకు దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించే సవధనం అని చెప్పవచుÊ,. దీని కలప ఓడలు, ఫర్నీచర్, ప్లైవుడ్, అలంకరణలు, శిల్పాలను ఈ చెట్టు ద్వారా తయారు చేయవచ్చు. ఈ విత్తనాలను కొన్ని ఔషధాల తయారీలో వాడతారు. షుగర్, కాన్సర్, బీపీ వంటి రుగ్మతల నివారణకు వాడే వైద్యంలో ఉపయోగిస్తారు.
4. నీలగిరి చెట్టు : మనం రోడ్లపై వెళ్తున్నప్పుడు ఇరువైపులా ఎత్తైన పచ్చని చెట్లు కనిపిస్తాయి. ఇందులో ఎక్కువగా నీలగిరి చెట్లే వుంటాయి. ఇవి పనికిరాని చెట్లని అనుకుంటారు. కానీ వీటితో బోలెడు లాభాలున్నాయి. ఇవి ఆస్ట్రేలియా మూలానికి చెందిన చెట్లు. మన దేశంలో కూడా వీటిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. నీలగిరి చెట్లను సాగు చేస్తే లక్షల్లో ఆదాయం వస్తుంది. పెద్దగా ఖర్చు కూడా వుండదు.