రైతులకు ₹4,800 కోట్లకు పైగా విలువైన MSPకొనసాగింపు
రైతుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 4,800 కోట్లకు పైగా కనీస మద్దతు ధర అండను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది రబీ పంట కాలానికి గాను కర్నాటకలో 9,000 మెట్రిక్ టన్నులకు పైగా పొద్దు తిరుగుడు పంటను MSP కి సేకరించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆమోదం తెలిపింది.దీని మొత్తం విలువ 69 కోట్లకు పైగా వుంటుంది. కర్నాటకలోని పొద్దు తిరుగుడు రైతులు తమ పంటను సరసమైన, లాభదాయక ధరలను పొందేందుకే ఈ నిర్ణయం అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
2025-26 రబీ సీజన్‌కు గాను, మహారాష్ట్రలో శనగల గరిష్ట సేకరణ పరిమితిని ప్రభుత్వం 8 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. ఈ నిర్ణయం ద్వారా లభించే మొత్తం కనీస మద్దతు ధర (MSP) విలువ రూ. 4,800 కోట్లకు పైగా ఉంటుంది. అంతేకాకుండా, మహారాష్ట్రలో శనగల సేకరణ కాలాన్ని ప్రభుత్వం మరో 30 రోజుల పాటు పొడిగించింది; దీనితో మే 29వ తేదీ వరకు సేకరణ ప్రక్రియ కొనసాగనుంది. గతంలో నిర్ణయించిన గడువులోగా తమ పంటను విక్రయించలేకపోయిన రైతులకు ఈ గడువు పొడిగింపు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.