రైలులో ప్రయాణిస్తున్న వలస కార్మికులకు ఆహారం పంపిణీ చేసిన ఆరెస్సెస్ కార్యకర్తలు

రైళ్లులో ప్రయాణించే వలస కార్మికులకు ఆహారాన్ని అందించాలని కోరిన 8 గంటలలోపే రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌కార్యకర్తలు వారికి సరపడే విధంగా దాదాపు 15000 వేలకు పైగా చపాతీ 14 000 పూరీలు చేసి అందించారు. ప్రధానంగా వీటిని కార్యకర్తల ఇంట్లో ఉండే మహిళలు చేశారు.

 రాత్రి 11.30 గంటలకి సికింద్రాబాద్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలకి పోన్‌ ‌చేసిన వెంటనే కార్యకర్తలు అందుకు అనుగుణంగా కావలసిన వస్తువులను సేకరించారు. దాంతో పాటు కార్యకర్తల ఇంటికి కూడా ఈ సూచనా ఇవ్వడం ద్వార ఇంట్లో ఉండే మాతృముర్తులు సైతం తమ వంతు సహాయ సహకారాలు అందించారు.

దాంతో పాటు బేగం బజార్‌ ‌లోని ఒక ఫంక్షన్‌ ‌హాల్‌ ‌లో కార్యకర్తలు చేరి భౌతిక దూరాన్ని పాటిస్తూ వంట, ప్యాకింగ్‌ ‌పనులు చేశారు. దీని వలన సికింద్రాబాద్‌ ‌నుండి నడిచే 10 రైళ్లు, లింగంపల్లి నుండి 8 రైళ్లు, కాచిగూడ, ఘటకేసర్‌ ‌నుండి 4, బొల్లారం నుండి 3 రైళ్లలో వెళ్తున్న వలస కార్మికులకు స్వయంసేవకులు ఆహార, మంచినీటి ప్యాకెట్లు సరఫరా అందించారు. దారి పొడుగునా ఆహారానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశం తో దాదాపు 14000 పూరీలు, అందుకు తగినంత కూరలు తయారుచేశారు.

రాత్రి 8.00 గం. లకు వచ్చిన సూచన ప్రకారం దిల్‌ ‌షుఖ్‌ ‌నగర్‌ ‌భాగ్‌ ‌తరఫున కాచిగూడ రైల్వే స్టేషను నుండి వేళ్లే వలస కార్మకుల కోసం 2500 భోజనం ప్యాకెట్స్ ‌ను తయారు చేశారు.

ఆరెస్సెస్‌ ‌పిలుపు మేరకు ఈ సేవా కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉండే కార్యకర్తలతో పాటు వారి ఇంట్లో ఉండే మహిళలు, గృహిణులు తమ తమ ఇండ్లలో చపాతీలు తయారు చేసి వలస కార్మికులకు పంపిణి చేశారు. గోల్కొండ బాగ్‌, ‌హిందీ నగర్‌, ‌సీతారాం బాగ్‌, ‌బోలారం నగరంలో 1000 చపాతీలు, మారేడ్‌ ‌పల్లి, కావడి గూడలో స్వయంసేవక్‌ల బృందాలు పాల్గొన్నాయి.

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌-‌డౌన్‌ ‌సడలింపు అనంతరం దేశవ్యాప్తంగా వలస కార్మికులు వారి స్వస్థలాలకు పయనమయ్యారు. వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాలు దాటి ప్రయాణం సాగిస్తున్న వలస కార్మికుల కోసం రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌కార్యకర్తలు ఆసరాగా నిలిచారు. రైళ్లల్లో ప్రయాణిస్తున్న వారికి ఆహార, మంచినీటి ఏర్పాట్లు చేశారు.

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వలస కార్మికులను వారి వారి గమ్యాలకు చేర్చేందుకు తెలంగాణలోని వివిధ స్టేషన్ల నుండి పలు ప్రత్యేక రైళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

వీరికి మార్గమధ్యలో ఆహార కొరత ఏర్పడకుండా ఉండేందుకు స్వయంసేవకులు ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *