లోక్ మంథన్ లో లిథునియా పౌరుల అగ్ని ఆరాధన
భాగ్యనగరం వేదికగా లోక్ మంథన్ భాగ్యనగరం 2024 వేడుకగా జరుగుతోంది. కళాకారులు, మేధావులతో పాటు విదేశీయులను కూడా లోక్ మంథన్ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంటోంది. భారతీయ సాంస్కృతిక కార్యక్రమాల పట్ల, సాంస్కృతి పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక వాయిద్యాలు, కళాకారులను అత్యంత సూక్ష్మంగా పరిశీలిస్తూ.. వాటి గురించి అడిగి తెలుసుకుంటున్నారు.
అయితే.. ఇందులో ఓ విశేషత కనిపించింది. లిథునియా రాజ్యానికి చెందిన వారు కూడా ఇక్కడికి వచ్చారు. వారు ఈ లోక్ మంథన్ కార్యక్రమం జరుగుతున్న శిల్పకళా వేదిక ఆవరణలో అగ్నిని ఆరాధిస్తూ కనిపించారు. అక్కడే ఓ చిన్న హోమ గుండం, సమిధలను ఏర్పాటు చేసి, అత్యంత శ్రద్ధాసక్తులతో అగ్నిని ఆరాధించారు. అంతేకాకుండా మంత్రాలను కూడా ఉచ్చరించారు. దీంతో ఆ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరూ విశేషంగా వారి వైపే చూశారు.