వందేమాతరం @150 : స్వదేశీ ఉద్యమానికి ప్రేరణ వందేమాతర ఉద్యమం (పార్ట్ -2)
స్వదేశీ అంటే జాతీయభావన, దేశభక్తి ఈ దేశంలో తయారైన వస్తువులనే వాడాలి. ఈ దేశ సాంస్కృతిక విలువలను కూడా కాపాడాలి. విదేశీ వస్తువులను బహిష్కరించాలి. 1896లోనే తిలక్ విదేశీ వస్త్రాలను బహిష్కరించే ఉద్యమం ప్రారంబించారు. ఆ సమయంలో అంత విశేష స్పందన రాలేదు. 1905 ఆగస్టు 7న కలకతా టౌన్హాల్లో జరిగిన బహిరంగ సభలో విదేశీ వస్తువులు బహిష్కరించాలని తీర్మానం చేయబడింది.
1905లో ప్రారంభమైన బెంగాలు విభజన ఉద్యమం స్వదేశీ పై ప్రభావం చూపింది. . విదేశీ వస్త్రాల అమ్మకాలు ఆరునుంచిఇరవైశాతం వరకు పడిపోయాయి. అశ్వనీకు మార్ దత్ అనే పాఠశాల ఉపాధ్యా యుడు బారిసాల్ పట్టణంలో స్వదేశీ బాంధవసమితి ఏర్పాటు చేశారు. ఈ సమితి కార్యకలాపాలు 1909 నాటికి 175 గ్రామాలలో జరుగుతున్నట్లుగా నమోదైంది. ఈ ఉద్యమం ముస్లిం రైతాంగంపై కూడా ఎక్కువ ప్రభావం చూపింది.
1905-08 మధ్యకాలంలో అనేక పరిశ్రమలలో పనిచేసే కార్మికులపై కూడా ఉద్యమ ప్రభావంపడింది ట్రామార్లు నడిపేవారు.జనపనార మిల్లులు రైల్వేలలో పనిచేసేవారు ఇట్లా అనేక మంది ఉద్యమంలోకి దూకారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికుల కొరతకూడ ఏర్పడింది. బొంబాయి. మద్రాసు, పంజాబులలోని ప్రజలపై ఈ ఉద్యమ ప్రభావం ఉన్నది అని ఆ నాటి ప్రభుత్వ నివేదికల ద్వారా తెలుస్తున్నది. ఉదా 1908 బొంబాయిలో తిలక్ నిర్బంధాన్నివ్యతిరేకంగా చేనేత పరిశ్రమలలో పనిచేసే కార్మికులు ధర్నా చేశారు అనేకమంది ప్రముఖ కవుల కలాల నుండి స్వదేశీ భావాన్ని ప్రేరేపించే కవితలు, పాటలు వెలువడ్డాయి. రవీంద్రనాధ్ ఠాగూర్ రచనలలో, సుబ్రమణ్యభారతి పద్యాలలో స్వదేశీభావన ప్రేరణ కనిపిస్తుంది
.
క్రాంతికారుల పోరాటానికి తెరలేపిన వంగవిభజన
1906 ఏప్రిల్ 14 వాటి అనుభవము కలకత్తాలోని యువతరాన్ని ఆలోచనలలో పడేసింది. బారిసాల్లో ఉద్యమం నిర్వహి స్తున్ననిరాయుధులైన ప్రజలపై పోలీసుల అమానుష దమనకాండ, ప్లేగువ్యాధి బారినపడిన వారిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోయడం,ఆంగ్లేయులపై సాయుధ పోరా టానికి యువతరాన్ని సిద్ధం చేసింది. అనేక రహస్య సంస్థల నిర్మాణానికి దారితీసింది. సంస్థాగతంగాపోరాటానికి సిద్ధం చేసింది. ఇది కేవలం బెంగాలులో మాత్రమే కాదు. దేశంలో అనేక చోట్ల ప్రారంభమైంది. వీరికి సాయుధ శిక్షణ కూడా ఇవ్వబడేది. బెంగాలులో అరవింద్ ఘోష్, పంజాబులో అజిత్ సిన్హాఅతని అనుచరులు, మహారా స్థలో చాపేకర్ సోదరులు, సావర్కర్ సోదరులు చురుకుగా నాయకత్వం వహించారు. బ్రిటీష్ అధికారులను, వారి ఏజెంటు లుగా పనిచేస్తున్నభార తీయులనుకేంద్రం చేసు కుని ఈ కార్య కాలపాలు కొనసాగు తుండేవి. బ్రిటీష్ వాళ్ళను భయభ్రాంతులను చేయడం వారి లక్ష్యం .
ఖుదీరాంబోస్ (16సం.) 1908 ఏప్రిల్ 30న జిల్లా జడ్జిపై దాడిచేశాడు. తృటిలోతప్పించుకొన్నాడు కానీ ఆ జడ్జి తో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరుమహిళలు చనిపోయారు. ఖుదీరాంబోసును నిర్భంధించి ఉరితీశారు. 30 కోట్లమంది భారతీయులు 60కోట్ల చేతులతో ఆంగ్లేయుల దౌర్జన్యాన్ని నిరోధించాలని క్రాంతికారులు పిలుపునిచ్చారు. ఈ క్రాంతికారి సంస్థలలో అనుశీల న సమితి చాలా ముఖ్యమైనది. దీర్ఘకాలం నడిచింది.
దేశస్వాతంత్ర సాధనకు నడుం కట్టే గొంతు విప్పిన వారందరికీ స్ఫూర్తినిచ్చినది వందేమాతరం.
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ వైద్యవిద్య పేరుతో బెంగాలు చేరుకొని అక్కడ అనుశీలనసమితిలో చేరారు. దానిలో సభ్యులై సాయుధ పోరాటంతో చేతులు కలిపి న ఈ. విప్లవకారులు ప్రజా ఉద్య నిర్మాణం చేయలేదు. మహారాష్ట్ర లో అభినవ భారత్ నాసిక్ కేంద్రంగా నడిచింది యువకులలో ఉద్యమ ప్రేరణ నిర్మాణం చేయడానికి ఇంగ్లాడులో చదువు కొనే భారతీయులకు అక్కడి ఇండియన్ హాజ్ కేంద్రబిందువుగా మారింది. ఇంగ్లాండ్ లో మదన్ లాల్ దీంగ్రా , కర్జన్ వాయల్ ను చంపేశాడు. ఈ విధంగా పోరాటం చేసి అశువులు బాసిన వారి చరిత్ర దేశవాసులలో కదిలిక తెచ్చింది.అలా స్వాతంత్ర సాధనకు నడుం కట్టే గొంతు విప్పిన వారందరికీ స్ఫూర్తినిచ్చినది వందేమాతరం.
– రాంపల్లి మల్లికార్జున