వందేళ్ల RSS కి సృజనాత్మక నివాళిగా రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాకరమైన భారీ ఏనిమేషన్ చిత్రం-సేవక్

బాల రాముడిపై విజయవంతమైన యానిమేషన్ సిరీస్ “శ్రీమన్ రామ్” సృష్టికర్త వందేళ్ల ఆరెస్సెస్ శతాబ్దపు సేవకు వినమ్ర నివాళిగా కొత్త యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ “సేవక్”ను ప్రకటించారు.హనుమాన్ జయంతి సందర్భంగా, జాతీయ అవార్డు విజేత, ప్రముఖ రచయిత-దర్శకుడు సత్యకాశీ భార్గవ తన తదుపరి భారీ ప్రాజెక్టు – “సేవక్” అనే యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌ను ప్రకటించారు. హైదరాబాదులో ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ఈ ప్రకటన, వందేళ్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)  శతాబ్ద కాల సేవకు కృతజ్ఞతగా నిర్మితమౌతోందని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాల ప్రేక్షకుల కోసం రూపొందించబడుతున్న “సేవక్”, ఓ ఉత్సాహభరితమైన 9 ఏళ్ల బాల కథానాయకుడు, ఒక ఆవు దూడ చుట్టూ తిరిగే కథ అని, ఈ చిత్రం అద్భుతమైన యానిమేషన్, హృదయాన్ని తాకే సంగీతం, రొమాంచక కథనంతో బాలలను దేశసేవ పట్ల గౌరవాన్ని కలిగించేలా తీర్చిదిద్దబడుతోందని చిత్ర రూపకర్తలు తెలిపారు.
“ఇది సాధారణ యానిమేషన్ ప్రాజెక్ట్ కాదు – ఇది ఓ సాంస్కృతిక ఉద్యమం. ఆరెస్సెస్ 100 ఏళ్లుగా చూపిన సేవా స్పూర్తికి ‘సేవక్’ నా వినయపూర్వక, సృజనాత్మక నివాళి రాబోయే తరాలకు ఆ సేవా స్ఫూర్తిని వారికి అర్ధమయ్యే రీతిలో , ఏనిమేషన్ మాధ్యమంలో అందించే ప్రయత్నమిది . ఈరోజు హనుమాన్ జయంతి, ప్రపంచంలోనే మొట్టమొదటి నిస్వార్ధ సేవకుడు హనుమంతుడు . రాముడు మన దేశపు ఆత్మ , అయన సేవలో పునీతుడైన హనుమంతుడి స్ఫూర్తిగా ” అని రచయిత, దర్శకుడు సత్యకాశీ భార్గవ ప్రత్యేకంగా చెప్పారు.
ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలో నిర్మాణ దశలోకి ప్రవేశించనుంది. మొదట హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలయ్యే ఈ చిత్రం, తర్వాత భారత్‌లోని వివిధ భాషల్లోకి విస్తరించనుంది. ట్రైలర్ విడుదల సమీపంలోనే ఉండగా, పూర్తి చిత్రం విజయదశమికి విడుదల చేయాలని లక్ష్యంగా ఉంచారు – ఇది స్వయంసేవా భావానికి సరిగ్గా సరిపోయే సందర్భంగా… అన్నారు.
“సేవక్” చిత్రం భారతీయ సాంస్కృతిక వారసత్వం, చారిత్రక ప్రదేశాలు, త్యాగ గాధల పర్యటనగా అలరిస్తుందని…. సంగీతం, నృత్యం, వినోదం, అడ్వెంచర్—అన్నీ కలిపి, బాలలను ఆకట్టుకునేలా రూపొందించబడుతుందని… ఈ కథను మరింత ప్రామాణికంగా, హృదయానికి హత్తుకునేలా రూపకల్పన చేసేందుకు, భార్గవ తన బృందంతో కలిసి సీనియర్ ఆరెస్సెస్ నాయకులను సంప్రదించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *