వక్ఫ్ సవరణ బిల్లుకి మద్దతిచ్చిన కేరళ కేథలిక్ బిషప్ కౌన్సిల్

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లిం లీగ్ తో పాటు సెక్యులర్ పార్టీలన్నీ నానా రభస చేస్తున్నాయి. అయితే.. కేరళ కేథలిక్ బిషప్ కౌన్సిల్ (KCBC) మాత్రం వక్ఫ్ సవరణ బిల్లుకి బహిరంగంగా మద్దతు ప్రకటించింది. అలాగే ఎంపీలందరూ దీనికి మద్దతివ్వాలని విజ్ఞప్తి కూడా చేసింది. ఇక.. కేంద్ర మాజీ మంత్రి కేజే అల్ఫోన్స్ కూడా స్పందించారు. ఈ బిల్లు చాలా తర్కబద్ధంగా వుందని చెప్పుకొచ్చారు. అదే వక్ఫ్ బోర్డు చరిత్రను చూస్తే.. పూర్తి అశాస్త్రీయంగా వుందని అర్థమైపోతుందని అన్నారు.
వక్ఫ్ బోర్డుతో చాలా కొద్ది మంది మాత్రమే లాభపడ్డారని అల్ఫోన్స్ విమర్శించారు. కేవలం ఓ మతపరమైన బోర్డుగానే వుందని,అలాగే బోర్డులో వున్న విభేదాలను కూడా తొలగించేందుకు కేంద్రం సవరణ బిల్లును తేవాలనుకుందని వివరించారు.మునంబంలో వక్ఫ్ బోర్డు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తోందని, వందల ఎకరాల భూమిని యధేచ్ఛగా క్లెయిమ్ చేసుకుంటోందన్నారు.ఇలాగే కొనసాగితే రేపు పార్లమెంట్ భవనం కూడా వక్ఫ్ ఆస్తే అంటారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *