వనవాసీలను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు : సీఎం విష్ణుదేవ్ సాయి
శతాబ్దాల నుంచి సనాతన ధర్మాన్ని వనవాసులు కాపాడుతున్నారని, సనానత ధర్మానికి అత్యధిక అనుచరులు కూడా వారేనని ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి అన్నారు.మౌని అమావాస్య సందర్భంగా కబీర్ధామ్ జిల్లా బోడ్లాలో ఏర్పాటు చేసిన 13వ “విరాట్ హిందూ సంగం”లో సాయి మాట్లాడారు. సభను ఉద్దేశించి సీఎం సాయి మాట్లాడుతూ.. వనవాసీలే అతిపెద్ద హిందువులని అన్నారు. శివుడు, పార్వతిని తల్లిదండ్రులని, ప్రకృతిని కూడా తల్లి స్వరూపంగా యుగయుగాలుగా వనవాసులు ఆరాధిస్తున్నారని వివరించారు. వనవాసీలు పూజలు చేస్తారని, ఉపవాసాలు కూడా చేస్తారని, వారు పెద్ద హిందువులని ప్రకటించారు.సమాజాన్ని వివిధ రకాలుగా విచ్ఛిన్నం చేయడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, వనవాసీ సమాజం దీనిపై అత్యంత అప్రమత్తంగా వుండాలని సీఎం పిలుపునిచ్చారు.