వాజ్ పేయికి నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని తదితరులు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి ధన్కర్, ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితరులు వాజ్ పేయీకి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాజీ ప్రధాని వాజ్ పేయిని స్మరించుకున్నారు. డిసెంబర్ 25న భారత రాజకీయాలకు, ప్రజలకు సుపరిపాలన దృఢమైన రోజుగా మోదీ అభివర్ణించారు. సుపరి పాలన విషయంలో వాజ్ పేయి ప్రజలందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు.