వాతావరణ మార్పులతో తగ్గనున్న వరి, గోధుమ దిగుబడులు
వాతావరణ మార్పుల కారణంగా దేశంలో వరి, గోధుమ దిగుబడులు 6 నుంచి 10 శాతానికి తగ్గిపోయే అవకాశం వుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఈ తగ్గుదలతో లక్ష మంది ఆహార భద్రతపై ప్రమాదం చూపుతుందని హెచ్చరించింది. భూతాపం ప్రభావంతో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని, ఫలితంగా హిమాలయాలతో పాటు దిగువ మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న కోట్ల మంది ఇబ్బందులు పడతారని పేర్కొంది.అలాగే తీర ప్రాంతాల్లో సముద్ర జలాలు వేడెక్కుతాయని, ఫలితంగా చేపలు తీరం నుంచి చల్లటి నీటి కోసం దూరంగా వెళ్లిపోతాయని, దీంతో మత్స్యకారులు కూడా ఇబ్బందులు పడతారని వాతావరణ విభాగం సూచించింది.