వేసవిలో ఔషధంలా పనిచేసేవి ఇవీ..
నిమ్మకాయ (నిమ్మ ఆకు)తో ఔషధ ప్రయోజనాలు
• నిమ్మ ఆకుల రసం, లేక నిమ్మ ఆకులు వేసి తోడు పెట్టిన మజ్జిగ చాలా చలవ చేస్తుంది
• నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దానివల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. తత్ఫలితంగా ఎన్నో క్రిమికీటాదులు మన శరీరాన్ని బాధించకుండా ఉంటుంది
• నిమ్మకాయ రసం, నీళ్ళు, ఉప్పు, పంచదార కలిపిన పానీయం త్రాగితే ఒక సెలైన్ సీసా పుచ్చుకున్నంత బలం వస్తుంది.
• నిమ్మకాయలో కెరోటిన్ అన్న రసాయనం వల్ల రక్తశుద్ధి కలిగి శరీరానికి మంచి కాంతి వస్తుంది.
• ఎండపెట్టిన నిమ్మకాయపొడి ముఖ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
====================
. కీరా దోసకాయలోని ఔషధ గుణాలు ఇవే..
పిత్త దోషాన్ని నియంత్రించడానికి చాలా ఉపయోగకరమైన ఔషధం.
కీరాతో మధుమేహం, రక్త పోటు, క్యాన్సర్, ulcer, నోటి దుర్వాసన సమస్యలు తగ్గించవచ్చు.
అమ్మాయిలు బరువు తగ్గడానికి కీరా ఒక దివ్య ఔషధం.
ఇవే కాకుండా vit A, B1, B6, C, D ఉన్నాయి.
పొటాషియం, మెగ్నీషియం మెండుగా లభించు ఔషధం.
కీళ్ళ నొప్పులకు ఛెక్ పెట్టె శక్తి కలది.
====================
. పుచ్చకాయలో ఎన్ని ఔషద గుణాలు దాగి ఉన్నాయో తెలుసా..
• 89% నీళ్ళు కలిగి ఉంటుంది, దీనివల్ల కిడ్నీ పనితీరు మెరుగుపడుతుంది.
• శరీరములో ఉండే క్రొవ్వు పదార్ధాలను కరిగిస్తుది
• శరీరములో వేడి తత్వము తగిస్తుంది.
• శరీర అవయవాలు సక్రమంగా పని చేసే విధంగా చూస్తుంది.
• ఒంటె నీళ్ళు దచుకున్నట్టు ఎండా కాలంలో తిన్న పుచ్చ కాయ సంవత్సరం పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.