వైభవంగా ప్రారంభమైన హిందూ దేవాలయ యువచైతన్య మహాపాదయాత్ర

శ్రీ భువనేశ్వరి పీఠము పీఠాధిపతులు, పూజ్య శ్రీశ్రీశ్రీ కమలానంద భారతీ స్వామి ఆంధ్ర రాష్ట్రంలో “భగవద్భక్తి – కర్తవ్య దీక్ష – సమాజ శక్తి” అనే నినాదంతో మరోసారి “హిందూ దేవాలయ యువచైతన్య మహాపాదయాత్ర” సనాతన హైదవ ధర్మ పరిరక్షణ, దేవాలయాల, సంస్కృతాంధ్ర భాషా పరిరక్షణ కొరకు, హిందూ యువ చైతన్యం కోసం తలకోన మహాశివాలయం నుంచి పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సభలో పలువురు స్వామీజీలతో సహా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సనాతన హైందవ ధర్మ పరిరక్షణ, దేవాలయాల, సంస్కృతాంధ్ర భాషా పరిరక్షణ కొరకు, హిందూ యువ చైతన్యం కోసం వైభవంగా ప్రారంభమైన ఈ యాత్ర ముఖ్యంగా నాలుగు అంశాలపై అనగా అవి, స్వభాషా, మాతృభాషా పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, కుటుంబవ్యవస్తను కాపాడుకోవటం, దేవాలయ పరిరక్షణ, అంతరాలు లేని సమాజ నిర్మాణం సమాజానికి అవగాహన కల్పించటానికి చేస్తున్నారు.
పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామిజీ “మన దేవాలయాలను మనమే కాపాడుకుందాం – మన సమాజాన్ని మనమే సేవించుకుందాం” అని సందేశంతో ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 2007 నుండి 2010 వరకు మూడు మహాపాదయాత్రలు, 2012 నుండి తిరిగి రథయాత్ర నిర్వహించారు. దాదాపు 8,500 గ్రామాలలో 35వేలకు పైగా దేవాలయాలను సందర్శించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ శ్రీ శ్రీ విరజానంద స్వామి బ్రహ్మం గారి మఠం మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడవలసిన బాధ్యత మన అందరిదీ అన్నారు, అలానే ధర్మ రక్షణ కోసం మఠాధిపతులు పీఠాధిపతులు వేల సంవత్సరాల నుండి వారి ప్రయత్నం వారు చేస్తుంటారు అని అన్నారు
మనం ఈ రోజు మంచి నీళ్ళు కొనుకుంటున్నము, అలానే ఆక్సిజన్ కూదా కొనుక్కోవల్సిన పరిస్తితి, ఇటువంటి పరిస్తుతుల్లో స్వామీజీఇటువంటి పాదయాత్ర పర్యావరణ పరిరక్షణ కై చేయడం ఎంతో స్వాగతింప చేయవలసిన, మనమంతా ఆచరించాల్సిన విషయంగా స్వస్వరూపనంద స్వామి అన్నారు.యువత అంతా ఒక రోజుపాటు నేను మీ ఊరు వచ్చునప్పుడు పాద యాత్రలో పల్గొనమని కమలానంద భారతీ స్వామి పిలుపునిచ్చారు. పండగలప్పుదు ఉత్సాహంగా పనిచేసే యువత సంవత్సరం పొడుగున దేవాలయాల ఆధారంగా పని చెయ్యాలని స్వామీజీ పిలుపునిచ్చారు.
kamalananda2
యువత అందరూ భక్తిమాధ్యమంగా సమాజాన్ని కలుపుతూ, కలిసిన సమాజం శక్తివంతంగా తయారై, ధర్మ పరిరక్షణ చేసుకునే విధంగా మలుచుకోవటమే నేటి వారి కర్తవ్యం స్వామీజీ పిలుపునిచ్చరు. అలానే మన దేవాలయాలను, గోసంపదను, జీవన మూలాలను, సామాజిక సమరసత మూల్యాలను గుర్తించి సంరక్షించుకుంటూ శాశ్వత కుటుంబ సమాజ జీవనాన్ని పదిలం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపినిచ్చారు.అలానే ఈ పాదయాత్ర సందర్భంగా తలకోన సమీపంలోని ఇంతవరకు దేవాలయం లేని గ్రామం, కాకుల రామారం లో స్వామీజీ చేతుల మీదుగా అభయాంజనేయ స్వామీ మరియు రేణుకా యెల్లమ్మ దేవతల విగ్రహాలని ప్రతిష్టించటం జరిగింది.రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ యాత్రలో, వచ్చే రెండు ఏళ్ళలో రాష్ట్రం మొత్తం లో దాదాపు 8 వేల గ్రామాలను స్వామీజీ పర్యటించనున్నారు, అందులో భాగంగా మొదటిదశలో రాబోయే 6 నెలలలో తిరుపతి, చిత్తూరు, అన్నయ్య, సత్యసాయి, అనంతపురం, కర్నూల్, నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నంద్యాల, కడప, నెల్లూరు జిల్లాలలో దాదాపు 1000 గ్రామాలను పర్యటించి మొదటి దశ కార్యక్రమం తిరిగి తిరుపతిలో ముగుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *