శివుడ్ని దుర్భాషలాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. రాజీనామాకు డిమాండ్

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండేల్ మహా శివుడ్ని దూషించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దీంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే… ఇది దురుద్దేశపూర్వకంగా కొన్నింటిని చేర్చిన వీడియో అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు. తనకు శివుడిపై అపారమైన భక్తి వుందని చెప్పుకొచ్చారు. తన వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని అంటున్నారు. అయితే మద్యం మత్తులో ఎమ్మెల్యే వున్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఈ మద్యం మత్తులోనే శివుడ్ని ఇష్టమొచ్చినట్లు దూషించారు. ఈ ఎమ్మెల్యేపై హిందువులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హిందూ మహాసభ కార్యకర్తలు ఈయన వ్యాఖ్యలను నిరసిస్తూ శివాలయం వెలుపల జండేల్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *