సంథాల్ ప్రాంతంలో గిరిజన జనాభా తగ్గి…. ముస్లిం జనాభా పెరుగుదల

జార్ఖండ్ లోని సంథాల్ పరగణాలో మతపరమైన జనాభా మార్పులపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పులపై జాతీయవాదులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత నిషికాంత్ దూబే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. గిరిజన జనాభా 45 శాతం నుంచి 28 శాతానికి పడిపోయిందన్నారు. అలాగే ఆ ప్రాంతంలో ముస్లిం జనాభా 9 శాతం నుంచి ఏకంగా 24 శాతానికి పెరిగిపోయిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలా మతపరమైన జనాభాలో మార్పులు రావడం వెనుక బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులే కారణమని దూబే ఎత్తి చూపుతున్నారు. అక్కడి ప్రభుత్వ సంతుష్టీకరణ విధానాల ద్వారానే ఇలా భారీ మార్పులు జరుగుతున్నాయని మండిపడ్డారు. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు పెరుగుతున్నారు. వారిని బుజ్జగించడానికి ప్రభుత్వం చేస్తున్న పనులు, కుట్రలు కూడా బహిర్గతం అవుతున్నాయి’’ అని పేర్కొన్నారు.
మరోవైపు అక్కడి విద్యారంగంపై కూడా దూబే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చాలా పాఠశాలల్లో ప్రాంతీయ భాషల స్థానే ఉర్దూను ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిందన్నారు. ఆదివారం సెలవు దినం కాకుండా శుక్రవారం సెలవు దినంగా మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోని పక్షంలో జార్ఖండ్ మెళ్లిగా బంగ్లాదేశ్ అయ్యే ఛాన్స్ వుందంటూ ప్రమాద హెచ్చరికలు పంపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *