సందర్శకుల కోసం తెరుచుకున్న తులిప్ పూదోట
ఆసియాలో కెల్లా అతి పెద్దదైన తులిప్ పూదోటను పర్యాటకుల సందర్శనార్థం తెరిచారు. 50 హెక్టార్ల విస్తీర్ణంలో 17 లక్షల పుష్పాలు వికసించిన ఈ తోట అందర్నీ ఆకర్షిస్తుంది. దాల్ సరస్సుకు, జబర్వాన్ కొండలకు మధ్య వున్న ఈ తోటను తెరవడంతో ఏటా కశ్మీర్ లో పర్యాటక సీజన్ ప్రారంభమైనట్లు లెక్క. ఈ సారి ముఖ్యమంత్రి ఒమర్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. తులిప్ తోట కశ్మీర్ సౌందర్యానికి ప్రతీక అని, ప్రకృతిని ప్రేమించే వారికి ఇదో ప్రత్యేక ఆకర్షణ అని పేర్కొన్నారు.
ఈ తోట ఆసియాలోనే అతిపెద్ద తులిప్ తోట, ఇది 30 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ 17 లక్షలకు పైగా తులిప్ పువ్వులు, 75 కంటే ఎక్కువ రకాల తులిప్‌లను చూడవచ్చు. ఈ తోట దాల్ సరస్సు సమీపంలో ఉంది. ఇక్కడ నుంచి జబర్వాన్ కొండల అందమైన దృశ్యం కనిపిస్తుంది. చుట్టూ మంచు పర్వతాలు, తెల్లటి నురుగుతో పాల సంద్రంగా కనిపించే సరస్సు వంటి అనేక అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి-ఏప్రిల్ నెలల్లో తులిప్ పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగ సందర్భంగా పర్యాటకుల కోసం అనేక కార్యకలాపాలను, కార్యక్రమాలను నిర్వహిస్తారు. తులిప్స్ పువ్వులతో పాటు, అనేక రకాల డాఫోడిల్స్, హైసింత్స్, నార్సిసస్ వంటి అనేక రకాల ఇతర విదేశీ పువ్వులను ఇక్కడ చూడవచ్చు.