సంస్కార భారతి గోల్కొండ పూర్తి జిల్లా సమితి ప్రకటన
సంస్కార భారతి గోల్కొండ జిల్లా సమితి సమావేశం మణికొండ చిత్రపురి కాలనీ డూప్లెక్స్ టవర్స్‌లో ఆదివారం జరిగింది. ప్రముఖ నటుడు సంస్కార భారతి రాష్ట కార్యదర్శి లోహిత్ కుమార్ స్వాగతం పలుకగా, ముఖ్య అతిథులుగా రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ వాడ్రేవు శివాజీ , రాష్ట సంఘటన మంత్రి జేపీ నిరంజన్, రాష్ట ఉపాధ్యక్షులు రాధా కృష్ణ విచ్చేశారు. తదనంతరం వీరందరూ జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత ధ్యేయగీతం తో సమావేశం ప్రారంభించారు. సంస్కార భారతి కళా మరియు సాహిత్య రంగంలో పనిచేస్తున్న అతి పెద్ద అఖిల భారత సంస్థ అని, సంస్థ విధి విధానాలను అతిథులు వివరించారు.
ఇక.. సంస్కార భారతి గోల్కొండ జిల్లా సమితి అధ్యక్షులుగా భవనం జ్యోతి రెడ్డి ప్రముఖ నటి (టీవీ మరియు సినిమా), ప్రధాన కార్యదర్శిగా శ్రీ చిన్నా బత్ శ్రీనివాస్ (అసిస్టెన్స్ ప్రొఫెసర్) ఎన్నికయ్యారని రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రకటించారు.అనంతరం గోల్కొండ నూతన జిల్లా అధ్యక్షులు శ్రీమతి భవనం జ్యోతి రెడ్డి 25 మందితో కూడిన పూర్తి జిల్లా సమితి ( కమిటీ)ని కూడా ప్రకటించారు. తర్వాత సాధారణ సభ్యత్వం స్వీకరించిన అందరికీ రసీదు వారు అందజేయడంతో విజయవంతంగా కార్యక్రమం ముగిసింది. ఇంకా ఈ సమావేశంలో రాష్ట బాధ్యులు వంపు రామచందర్, ప్రవీణ్ రామరాజు, దత్తాత్రేయ తదితరులు ఉన్నారు.